ఫోటో స్టోరి: ప్రగ్య నవ్వులు సిగ్గుల మొగ్గలు
ప్రగ్యా జైశ్వాల్.. పరిచయం అవసరం లేని పేరు. ముంబై టు హైదరాబాద్ ప్రగ్య జర్నీ గురించి తెలిసిందే
By: Tupaki Desk | 22 July 2024 6:05 PM GMTప్రగ్యా జైశ్వాల్.. పరిచయం అవసరం లేని పేరు. ముంబై టు హైదరాబాద్ ప్రగ్య జర్నీ గురించి తెలిసిందే. టాలీవుడ్ లో అడుగుపెడుతూనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన కంచె చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత స్నేహితుల అండదండలతో ప్రగ్య కెరీర్ కొన్నాళ్ల పాటు ముందుకు సాగిందని ప్రచారమైంది. కానీ ఇటీవల ప్రగ్యకు ఆశించిన అవకాశాల్లేవ్. అటు బాలీవుడ్ లో సల్మన్ ఖాన్ సినిమాలో అవకాశం వచ్చినా కానీ, ఆ సినిమా (కిసీ కా భాయ్..) ఫ్లాపవ్వడం తనకు పెద్ద మైనస్ అయింది.
అదంతా అటుంచితే ప్రగ్య సోషల్ మీడియాల్లో నిరంతరం అభిమానులకు టచ్లో ఉంది. వారికి అవసరమైన ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా ప్రగ్య షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. వీటిలో ప్రగ్య అందమైన నవ్వు, అలంకరణ, సిగ్గు పడే విధానం యువతరాన్ని హత్తుకుంటున్నాయి. ప్రగ్య చిలుకాకు పచ్చ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తోంది. అంతకుమించి ఈ డిజైనర్ లుక్ నిజంగా కవ్విస్తోంది! ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతోంది.
అఖండ, సన్నాఫ్ ఇండియా తర్వాత ప్రగ్య టాలీవుడ్ లో నటించలేదు. ప్రస్తుతం హిందీలో `ఖేల్ ఖేల్ మై` అనే క్రేజీ చిత్రంలో నటిస్తోంది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్, ఫర్ధీన్ ఖాన్, తాప్సీ తదితరులు నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ లో ప్రగ్య పాత్ర ఆకట్టుకునేంతగా ఉందా లేదా? అన్నది ఇంకా తెలీదు. ఇప్పుడు తన కెరీర్ కి బ్రేక్ నిచ్చే ఛాయిస్ అవుతుందా లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.