థై షో తో బ్యూటీ పేపరింగ్ మాములుగా లేదే!
ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకుంది.
By: Tupaki Desk | 16 May 2024 6:26 AM GMTప్రగ్యా జైశ్వాల్ టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. చిట్టిపొట్టి దుస్తుల్లో మంటలు రేపిన సంద ర్భాలెన్నో. ఫ్యాషన్ వరల్డ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకుంది. చేతిలో సినిమాలు లేకపోయినా ఇంకా కాంపిటీషన్ లో ఉంది అంటే? అందుకు కారణం ప్రగ్యా లో ఆ రకమైన అప్పిరియన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సందర్భాన్ని బట్టి చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. డిజైనర్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది.
బికినీ..టూపీస్..థై ఎలివేషన్స్ లతో మంటలు పుట్టిస్తుంది. తాజాగా అమ్మడు మరో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా థై షోతో గుబులు పుట్టించే బాధ్యత మరోసారి తీసుకుంది. వైట్ కలర్ షర్ట్ లో ప్రగ్యా థై ఎలివేషన్ పీక్స్ లో ఉంది. టాప్ నుంచి థై వరకూ షర్ట్ తోనే మ్యానేజ్ చేసింది. ఒకవైపు వైట్..మరోవైపు లైట్ బ్లూ కలర్ డిజైన్ షర్ట్ లో తనలో బ్యూటీని పర్పెక్ట్ గా లాంచ్ చేసింది. అక్కడ నుంచి రచ్చ మామూలుగా లేదు.
ఇక అమ్మడి స్కిన్ టోన్ గురించైతే చెప్పేదేముంది. పాల నురుగుల సౌందర్యంతో ఆహా అనిపిస్తుంది. మునుపటి కంటే మరింత సౌందర్యవంగా హైలైట్ అవుతుంది. అమ్మడి వయసు 36 దాటినా 26 బ్యూటీలా మెరిసిపోతుంది. ప్రగ్య కూడా మంచి ఫిట్ నెస్ ప్రీక్. చక్కని డైట్ ఫాలో అవుతుంది. అందుకే అంత అందంగా హైలైట్ అవుతుంది. ఇదే డిజైనర్ లో వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రగ్యా లో బ్యూటీని ఫ్యాన్స్ అంతే ఆస్వాదిస్తున్నారు. అమ్మడి నుంచి ఎలాంటి ఫోటోలు లీకైనా అభిమానులకు పండగనే. ఈసారి ఆ ఉత్సాహం రెట్టింపు అయింది.
ఇక ప్రగ్యాజైశ్వాల్ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు..హిందీ..తమిళ్ లో సినిమాలు చేసినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. ఈ రెండు భాషలకంటే బెటర్ గా తెలుగులోనే సినిమాలు చేసింది. ఈ మధ్యనే తన తొమ్మిదేళ్ల క్రితం నాటి కల నిజమయ్యే మరో అవకాశం అందుకుంది. అక్షయ్ కుమార్ ..తాప్సీ ..వాణీ కపూర్ నటిస్తోన్న `ఖేల్ ఖేల్ మే` చిత్రంలో ప్రగ్యా అవకాశం అందుకుంది. ఇందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తుంది.