Begin typing your search above and press return to search.

చిన్న గౌనులో చిలిపి నవ్వుతో ప్రగ్యా

వైట్ కలర్ షార్ట్ స్కర్ట్ వేసుకున్న ఈ అమ్మడు థైస్ అందాలు చూపిస్తూ చిలిపి చిరునవ్వుతో కుర్రాళ్ళ మనసులు కొల్లగొడుతోంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 5:01 AM GMT
చిన్న గౌనులో చిలిపి నవ్వుతో ప్రగ్యా
X

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. ఈ బ్యూటీ మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. వరుణ్ తేజ్ తో చేసిన కంచె మూవీ ప్రగ్యాకి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే తరువాత ఆమెకి మళ్ళీ ఆ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే పాత్రలు పడలేదని చెప్పాలి.


ఎక్కువగా గ్లామర్ రోల్స్ కి పరిమితం అయ్యింది. మనోజ్ తో గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇవేవీ కూడా ఆమెకి సక్సెస్ ని అందించలేదు. చివరిగా బాలకృష్ణకి జోడీగా అఖండ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అయితే హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ కెరియర్ కి మాత్రం ఏ విధంగా ఉపయోగపడటం లేదు. ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ అయితే లేవు. కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలని లక్షల్లో నెటిజన్లు చూస్తూ ఉంటారు. ఎలాంటి సంకోచం లేకుండా హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో ప్రగ్యా జైశ్వాల్ కుర్రకారుకి వినోదం అందిస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి అదిరిపోయే ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తోంది. వైట్ కలర్ షార్ట్ స్కర్ట్ వేసుకున్న ఈ అమ్మడు థైస్ అందాలు చూపిస్తూ చిలిపి చిరునవ్వుతో కుర్రాళ్ళ మనసులు కొల్లగొడుతోంది. కవ్వించే అందాలతో కనువిందు చేస్తోన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య గ్లామర్ బ్యూటీస్ అందరికి కూడా ఇన్ స్టాగ్రామ్ ఫోటోషూట్ లకి వేదికగా మారిపోయింది. చాలా మంది దర్శకులు క్యాస్టింగ్ సెలక్షన్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలని చూసినా చేసుకుంటున్నారు. ఇక ప్రగ్యా జైశ్వాల్ విషయానికి వస్తే తెలుగులో ఛాన్స్ లు తగ్గడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. మరి ప్రగ్యాకి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ లు ఏమైనా వస్తాయేమో చూడాలి.