Begin typing your search above and press return to search.

బీచ్‌ని మ‌రిగించిన ప్ర‌గ్య రెడ్ హాట్ బికినీ

రెడ్ హాట్ బికినీలో ప్రగ్యా జైస్వాల్ అంద‌చందాలు బీచ్ ని మ‌రిగించాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు యువ‌త‌రంలో వైర‌ల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:06 AM GMT
బీచ్‌ని మ‌రిగించిన ప్ర‌గ్య రెడ్ హాట్ బికినీ
X

బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన తెలుగు యాక్షన్ డ్రామా అఖండలో నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రగ్యా జైస్వాల్ చివరిసారిగా స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేస్కుంది. దీని తరువాత అందాల ప్ర‌గ్య‌ పెద్ద ఆఫర్లను పొందడంలో విఫలమైంది. మంచు కాంపౌండ్ లో కొన్ని అవ‌కాశాలొచ్చినా వాటివ‌ల్ల క‌లిసొచ్చిందేమీ లేదు.


బాలీవుడ్ లో స‌ల్మాన్ భాయ్ సినిమాలో అవ‌కాశం ద‌క్కినా కానీ అది కూడా క‌లిసి రాలేదు. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ బికినీ ట్రీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌పంచవ్యాప్తంగా బీచ్ ప్ర‌దేశాల‌ను పర్యటించడానికి ఇష్టపడే ప్ర‌గ్య‌ ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. బికినీ కోసం అవ‌స‌ర‌మైన ప‌ర్ఫెక్ట్ ఆకారాన్ని ప్ర‌గ్య‌ కలిగి ఉంది. తాజాగా షేర్ చేసిన ప‌ర్పుల్ బికినీ క్ష‌ణాల్లో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది.


రెడ్ హాట్ బికినీలో ప్రగ్యా జైస్వాల్ అంద‌చందాలు బీచ్ ని మ‌రిగించాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు యువ‌త‌రంలో వైర‌ల్ గా మారాయి. క్రిష్ పీరియాడికల్ డ్రామా కంచెలో సీతా దేవి పాత్రను పోషించింది ప్ర‌గ్య‌. కెరీర్ ఆరంభ‌మే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేస్కుంది. 2015లో విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అనేక అవార్డులను గెలుచుకుంది. ప్ర‌గ్య న‌ట‌న‌, అందమైన చిరునవ్వు కారణంగా తెలుగు ప్ర‌జ‌ల ఆదరణ పొందింది. త‌ర్వాత ఎన్బీకే స‌ర‌స‌న అఖండ చిత్రంలో న‌టించి మ‌రో విజ‌యాన్ని సాధించింది. ఇటీవ‌ల ప్ర‌గ్య నూత‌న సంవత్స‌రాన్ని స్వాగ‌తిస్తూ అంద‌మైన ఫోటోల‌ను షేర్ చేసింది. '2024 ఎనర్జీ' అనే ట్యాగ్ లైన్ తో వీటిని షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. త‌దుప‌రి పెద్ద అవ‌కాశాల కోసం కొత్త సంవ‌త్స‌రంలో త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది.