Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ Vs ప్రకాష్ రాజ్.. సుజిత్ కు పెద్ద టాస్కే!

తిరుమల లడ్డు, సనాతన ధర్మం విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Oct 2024 5:25 AM GMT
పవన్ కళ్యాణ్ Vs ప్రకాష్ రాజ్.. సుజిత్ కు పెద్ద టాస్కే!
X

తిరుమల లడ్డు, సనాతన ధర్మం విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడుతుంటే.. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్వీట్ పెట్టారు. పవన్.. డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడుతూ ఆ విషయం ప్రస్తావించారు. దీంతో ప్రకాష్ రాజ్.. వరుసగా పోస్టులు పెట్టారు. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మరోసారి ఆ విషయంపై స్పందించలేదు.

దీంతో ఇద్దరి మధ్య రాజకీయ పరంగా అభిప్రాయ బేధాలు వచ్చాయనే చెప్పాలి. అయితే సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే ఇద్దరూ కలిసి పలు ప్రాజెక్టుల్లో కనిపించారు. సుస్వాగతం చిత్రంలో ప్రకాష్ రాజ్ కూతుర్నే పవన్ ప్రేమిస్తారు. ఆ మూవీలో ప్రకాష్ రాజ్ డైలాగ్స్ మంచి హిట్ అయ్యాయి. ఆ తర్వాత జల్సా, వకీల్ సాబ్ చిత్రాల్లో కూడా పవన్, ప్రకాష్ రాజ్ నటించారు. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటారని, అది సుజిత్ కు పెద్ద టాస్కే అని వార్తలు వస్తున్నాయి.

ఏపీ రాజకీయాలతో బిజీగా ఉండి సినిమాలను పక్కన పెట్టిన పవన్.. ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూట్ జరుగుతుండగా.. నవంబర్ రెండో వారం నుంచి ఓజీ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలు కానున్నట్లు టాక్. అయితే ఓజీలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారట. పవన్, ప్రకాష్ రాజ్ మధ్య పవర్ఫుల్ సీన్స్ ఉన్నాయని సమాచారం.

ఇద్దరి మధ్య ఫైట్ సీన్ కూడా ఉందని వార్తలు వస్తుండటంతో సినీ ప్రియులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో డైరెక్టర్ సుజిత్ కు అది పెద్ద టాస్క్ అని నెటిజన్లు చెబుతున్నారు. ఓ రేంజ్ లో వివాదం జరిగిన తర్వాత సెట్స్ లో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఎదురుపడడం మామూలు విషయం కాదని అంటున్నారు. డైలాగ్స్ అండ్ షూట్ విషయంలో సుజిత్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు పట్టించుకోకుండా సినిమా షూట్ చేసుకుని ఇద్దరూ వెళ్లిపోతారేమోనని అంటున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఓజీలో పవన్, ప్రకాష్ మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయో చూడాలి.