Begin typing your search above and press return to search.

చేతులెత్తి దండం పెడుతూ... ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్!

అయితే ఈయన చేసిన ట్వీట్ మాత్రం హాట్ టాపిక్ అయింది. కారణం... దీనికి ముందు చంద్రయాన్‌-3పై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ దుమారం రేపడమే.

By:  Tupaki Desk   |   24 Aug 2023 5:43 AM GMT
చేతులెత్తి  దండం  పెడుతూ... ప్రకాశ్  రాజ్  ట్వీట్  వైరల్!
X

దిగ్విజయంగా చంద్రయాన్ 3 జాబిలి పై ల్యాండ్ అవ్వడంతో దేశమంతా ఇస్రో పై ప్రశంసలు కురిపిస్తుంది. చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండర్ ను దించిన మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేయడంతో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశ్ రాజ్ స్పందించారు.

అవును... ఈ చంద్రయాన్‌-3 సక్సెస్ పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే ఈయన చేసిన ట్వీట్ మాత్రం హాట్ టాపిక్ అయింది. కారణం... దీనికి ముందు చంద్రయాన్‌-3పై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ దుమారం రేపడమే.

మూడు నాలుగు రోజుల క్రితం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని అపహేళన చేసేలా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కర్ణాటకలో ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్ కాగానే ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ పెట్టారు.

"చంద్రుడిపై అంతరిక్ష ప్రయోగం సక్సెస్ చేసిన ఈ మానవ ప్రయత్నానికి దండం" పెడుతూ... ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా... "చంద్రయాన్ 3, విక్రమ్ ల్యాండర్, ఇస్రో శాస్త్రవేత్తలకు, అదేవిధంగా ఈ ప్రయోగంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది దేశానికే గర్వకారణమైన సంఘటన" అని అన్నారు!

కాగా... ఈ ప్రయోగం సక్సెస్ కి ముందు ట్విటర్‌ లో ఓ కార్టూన్‌ ను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. "బ్రేకింగ్ న్యూస్ చంద్రుడిపై చంద్రయాన్ 3 తీసిన తొలి ఫోటో" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ కార్టూన్‌ లో ఓ వ్యక్తి లుంగి క‌ట్టుకుని.. టీ పోస్తున్నట్లు ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించకుండానే.. ఆయననే ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనే కామెంట్లు వినిపించాయి.

ఆ ట్వీట్ వైరల్ కావడం.. తనపై ట్రోలింగ్ తీవ్రం కావడంతో ప్రకాశ్ రాజ్ దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ద్వేషించే వారికి అంతా ద్వేషమే కనిపిస్తుందని.. అది ఆర్మ్ స్ట్రాంగ్ కాలం నాటి జోక్ అని మరో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా సక్సెస్ తర్వాత ఇలా పాజిటివ్ గా స్పందించారు ప్రకాశ్ రాజ్!