సారీ చెబుతావా చెప్పవా? ప్రకాష్ రాజ్‌ని నిలదీసిన నెటిజనులు!
చాలా చీవాట్లను ఎదుర్కొన్న తరువాత నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఇస్రో అద్భుతమైన ఫీట్‌ను ప్రశంసించారు
By: Tupaki Desk | 24 Aug 2023 12:03 PM GMTసోషల్ మీడియాల్లో చంద్రయాన్ -3 మిషన్‌పై వెకిలి కార్టూన్ ని షేర్ చేసి కామెంట్లు చేసినందుకు ప్రకాష్ రాజ్ పై నెటిజనులు తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చాలా చీవాట్లను ఎదుర్కొన్న తరువాత నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఇస్రో అద్భుతమైన ఫీట్‌ను ప్రశంసించారు. మైక్రో-బ్లాగింగ్ వెబ్‌సైట్ లో చంద్రయాన్ 3 విజయాన్ని కీర్తిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మిషన్ విజయవంతం అయినందుకు ఇస్రోని అభినందించినందుకు ప్రకాష్ రాజ్ ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇంతకుముందు కించపరిచే పోస్ట్ ని షేర్ చేసినందుకు ముందుగా క్షమాపణ చెప్పాలని ఒక నెటిజన్ అడిగాడు.
''భారతదేశం సహా ప్రపంచ మానవజాతికి గర్వకారణమైన క్షణమిది.. ఇస్రో, చంద్రయాన్-3, విక్రమ్ ల్యాండర్ .. దీనిని సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ఇది చంద్రునిపై అన్వేషించడానికి మనకు మార్గనిర్దేశనం చేస్తుంది. సెలబ్రేట్ ది మిస్టరీ ఆఫ్ అవర్ యూనివర్స్'' అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యను జోడించారు. అయితే ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు తీవ్రంగా ట్రోల్ చేసారు.
ప్రకాష్ రాజ్ కార్టూన్ పై కొన్ని వ్యాఖ్యలు పరిశీలిస్తే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ''కొంతైనా సిగ్గుపడండి... ఇస్రోను ట్రోల్ చేసింది మీరే'' అని ఒక అభిమాని వ్యాఖ్యానించగా.. ''ముందు మీ కించపరిచే పోస్ట్‌కు క్షమించమని అడగండి'' అని రాశారు. ''మీకు కూడా అభినందనలు. మన చాయ్‌వాలా .. మన శాస్త్రవేత్తలు ఈ రోజు చరిత్ర సృష్టించారు. ద్వేషించే వారందరికీ సందేశం ఇచ్చారు. తిట్లు, జోకులన్నీ వరాలుగా మార్చే #newindia ఇదే!'' అని కామెంట్లు చేసారు.
నటుడు-రాజకీయనాయకుడు అయిన ప్రకాష్ రాజ్ ఆగష్టు 20న ఒక కార్టూన్‌ను ట్వీట్ చేసిన తర్వాత కల్లోలం మొదలైంది. ''ద్వేషం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది... నేను నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ టైమ్‌లో ఒక జోక్‌ని సూచిస్తున్నాను... మన కేరళ చాయ్‌వాలా పనిని సెలబ్రేట్ చేసుకుంటున్నాను... ఇది చాయ్‌వాలా చేసింది.. చూస్తారా? మీకు జోక్ రాకపోతే జోక్ మీపైనే ఉంటుంది .. GROW UP #justasking.. అని ట్వీట్ చేసారు.
అయితే దీనిపై తీవ్ర నిరశనలు వ్యక్తమయ్యాయి. చంద్రయాన్-3 మిషన్‌పై ఆయన చేసిన ట్వీట్ పై ఒక మతపరమైన సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఈ ఫిర్యాదు నమోదైంది. రష్యా చంద్రుడి ఉపరితలంపై దిగడంలో విఫలమైన కొద్ది రోజులకు భారతదేశ అంతరిక్ష సంస్థ (ఇస్రో) తన అంతరిక్ష నౌకను చంద్రమండల ఉపరితలం దక్షిణ ధ్రువంపై దింపిన మొదటి మిషన్ గా చరిత్ర సృష్టించింది.