Begin typing your search above and press return to search.

ప్రణయ గోదారి.. రిలీజ్ ఎప్పుడంటే..

ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్న నేపధ్యంలో ప్రమోషన్లు వేగంగా జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   9 Dec 2024 10:21 AM GMT
ప్రణయ గోదారి.. రిలీజ్ ఎప్పుడంటే..
X

ఇటీవల కాలంలో డిఫరెంట్ కంటెంట్ ఉన్న లోకల్ కథలకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన కథను చూపగలిగితే మొదట్లోనే ఆడియెన్స్ ఎట్రాక్ట్ అవుతుంటారు. ఇక అదే తరహాలో ఆకట్టుకునేందుకు మరో సినిమా రెడీ అవుతోంది. విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ప్రణయ గోదారి డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు.

పిఎల్ విఘ్నేష్ ప్రణయ గోదారి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఇటీవల విడుదల చేసిన పోస్టర్ ద్వారా ప్రకటించారు. పోస్టర్‌లో ప్రధాన పాత్రల లుక్స్ ఆకట్టుకునే విధంగా రూపొందించారు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

సాయి కుమార్ పాత్రకు సంబంధించిన వేషధారణ, బాడీ లాంగ్వేజ్ నటన సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని అర్ధమవుతుంది. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. సినిమా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల జీవితాలను, అక్కడి సవాళ్లను హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం, సినిమా కథలో భావోద్వేగాలు, సస్పెన్స్, వినోదం అన్నీ సమపాళ్లలో ఉంటాయని చెబుతున్నారు.

గతంలో విడుదల చేసిన పాటలు మంచి ప్రజాదరణ పొందాయి, వీటికి మార్కండేయ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్న నేపధ్యంలో ప్రమోషన్లు వేగంగా జరుగుతున్నాయి. మున్ముందు సినిమాకు మరింత హైప్ తీసుకురావడానికి మేకర్స్ కొత్త కంటెంట్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో ఆర్టిస్టుల పాత్రలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్ అందించిన విజువల్స్ ప్రేక్షకులను గ్రామీణ నేపథ్యానికి కట్టిపడేస్తాయట. కొరియోగ్రాఫర్లు కళాధర్, మోహనకృష్ణ, రజిని డ్యాన్స్ సీక్వెన్స్‌లను ప్రత్యేక ఆకర్షణగా మలిచారు. ఎడిటర్ కొడగంటి వీక్షిత వేణు కట్ చేసిన సన్నివేశాలు సినిమాను మరింత చక్కగా ఆవిష్కరిస్తాయని భావిస్తున్నారు. ప్యూర్ పల్లెటూరి నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం ఖాయం అని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది.