Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' ట్రోలింగ్ పై నిర్మాత సాలిడ్ కౌంట‌ర్!

ఈ నేప‌థ్యంలో బాబి డియోల్ ఎంట్రీ స‌న్నివేశంపై ట్రోలింగ్ తెర‌పైకి వ‌స్తోంది. మైనారిటీ వర్గానికి చెందిన విరోధి బాబీ డియోల్ పాత్రను పోషించడంపై బాలీవుడ్‌లోని ఒక వర్గం విమ‌ర్శిస్తోంది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 1:30 AM GMT
యానిమ‌ల్ ట్రోలింగ్ పై నిర్మాత సాలిడ్ కౌంట‌ర్!
X

'యానిమ‌ల్' భారీ విజ‌యం..బాక్సాఫీస్ వ‌సూళ్ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఆ సినిమాపై ఏ స్థాయిలో వివాదం.. విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయో తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన రోజులు గ‌డుస్తున్నా? కొద్ది చిత్రంపై డే బై డే నెగిటివిటీ ఎక్కువ‌వుతోంది. సందీప్ రెడ్డి వంగ చిత్రంలో మ‌లిచిన పాత్ర‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తు న్నారు. దీంతో ఎవ‌రికి వారుగా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది.

కొన్ని ఇబ్బందిక‌ర స‌న్నివేశాల్లో త‌ప్ప‌క న‌టించాల్సి వ‌చ్చింద‌ని రణ‌బీర్ క‌పూర్ ..బాబీ డియోల్ ముందే రివీల్ చేయ‌డం? ఆత‌ర్వాత విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ అవ్వ‌డం తెలిసిందే.' వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్స‌హించే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని..పాత్ర డిమాండ్ మేర‌కు అలాంటి సీన్ పెట్టాల్సి వ‌చ్చింద ని..అబ్రార్ పాత్ర నిడివి త‌క్కువ‌ని ఉన్న స‌మ‌యంలోనే క్యారెక్ట‌ర్ ఎలాంటిదో ప్రేక్ష‌కుల‌కు అర్దం కావా లంటే? అలాంటి సీన్స్ క్రియేట్ చేయాల్సి వ‌చ్చింద‌ని..స‌మాజంలో జ‌రుగుతోన్న ఘ‌ట‌న‌లే సినిమాలో క‌నిపిస్తాయి త‌ప్ప వాటిని సినిమా ద్వారా ప్ర‌మోట్ చేయ‌లేద‌ని బాబీ డియోల్ వివ‌ర‌ణ ఇచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో బాబి డియోల్ ఎంట్రీ స‌న్నివేశంపై ట్రోలింగ్ తెర‌పైకి వ‌స్తోంది. మైనారిటీ వర్గానికి చెందిన విరోధి బాబీ డియోల్ పాత్రను పోషించడంపై బాలీవుడ్‌లోని ఒక వర్గం విమ‌ర్శిస్తోంది. ప్ర‌త్యేకంగా ఒక వ‌ర్గాన్ని అక్క‌డ హైలైట్ చేస్తున్న‌ట్లు సినిమాలో చూపించార‌ని ఆరోపణ‌లొస్తున్నాయి. నెట్టింట దీనిపై ట్రోలింగ్ జ‌రుగుతోంది. తాజాగా ఈ ట్రోలింగ్ నిర్మాతలలో సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

'మేము ఒక సంఘాన్ని ప్రత్యేకంగా చూపించామ‌ని ఎవరో ఫిర్యాదు చేస్తున్నారు. గత ఇరవై ముప్పై ఏళ్లలో బొట్టు (డిండి)తో ఎంతమంది విలన్‌లుగా నటించారు. ఎవరైనా ఫిర్యాదు చేశారా? కొన్ని ప్రమేయాల కార‌ణంగా ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దయచేసి మనసులో ఉన్న చెడు అభిప్రాయాలు తీసేయండి. ప్ర‌జ‌ల్లోకి సినిమాని చెడుగా తీసుకెళ్లొద్ద‌ని' అని అన్నారు.