Begin typing your search above and press return to search.

స్టన్నింగ్ లుక్‌లో ప్రణీత.. ఫ్యాషన్ వీక్ లో అసలైన గ్లామర్ ట్రీట్

తెలుగు ప్రేక్షకులకు ప్రణీత సుభాష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 3:00 AM GMT
స్టన్నింగ్ లుక్‌లో ప్రణీత.. ఫ్యాషన్ వీక్ లో అసలైన గ్లామర్ ట్రీట్
X

తెలుగు ప్రేక్షకులకు ప్రణీత సుభాష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘బావ’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ సుందరి, తన అందంతోనే కాదు, అద్భుతమైన నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సమంత తర్వాత స్పెషల్ పాత్ర పోషించిన ప్రణీత, తన క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్‌తో ఎంతగానో మెప్పించింది. ఆమె కెరీర్ ప్రారంభంలోనే వరుస అవకాశాలతో దూసుకెళ్లింది.

ప్రణీత కెరీర్‌లో ‘అత్తారింటికి దారేది’, ‘బ్రహ్మోత్సవం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాలు తెలుగులో ఓ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. కాకపోతే, ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో కనిపించింది. కన్నడ చిత్రాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంది.

ఇటీవల ప్రణీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా ఫోటోషూట్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొని మెరిసిపోతున్న ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్లామరస్ గౌన్‌లో, మెరిసే డ్రెస్‌లో ఆమె లుక్ యాప్ట్‌గా అనిపిస్తోంది. సొగసైన మేకప్, స్టైలిష్ హేర్‌స్టైల్‌తో ప్రణీత ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచింది. ఆమె వేసుకున్న డ్రస్ లుక్, డిజైనింగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పెళ్లి తర్వాత ఆమె కెరీర్‌కు గ్యాప్ ఇచ్చినా, మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తుందా? అన్న ప్రశ్న అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం ఆమెకు కూతురు, కుమారుడు ఉన్నాడు. అయినప్పటికీ ప్రణీత తన గ్లామర్‌తో, స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆమె ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తూ, మరోవైపు ఫ్యాషన్ రంగంలోనూ తనదైన స్టైల్‌ను చూపిస్తోంది. టాలీవుడ్‌ లో ఆమె మళ్లీ రీఎంట్రీ ఇస్తుందా? లేదా మోడలింగ్, ఫ్యాషన్ ఫీల్డ్‌కి పరిమితం అవుతుందా? అన్నది చూడాలి.