Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బాత్‌ టబ్ లో అందాల బాపుబొమ్మ

స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వచ్చినా కూడా కెరీర్‌ లో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయింది.

By:  Tupaki Desk   |   2 Jun 2024 12:25 PM GMT
పిక్ టాక్ : బాత్‌ టబ్ లో అందాల బాపుబొమ్మ
X

పవన్ కళ్యాణ్‌ అత్తారింటికి దారేది సినిమాతో పాటు ఇంకా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ ప్రణీత. ఈ అమ్మడు టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల సినిమాల్లో నటించినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వచ్చినా కూడా కెరీర్‌ లో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయింది.


హీరోయిన్‌ గా ప్రణీత ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ అమ్మడు థాయిల్యాండ్‌ లో హాలీడేస్ ను ఎంజాయ్‌ చేస్తుంది.


తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేసింది. థాయ్‌ లో తాము బస చేస్తున్న హోటల్‌ అందాలను చూపించడంతో పాటు అందమైన తన రూపం ను చూపిస్తూ ఫోటో షూట్‌ ను షేర్ చేసింది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అని మళ్లీ నిరూపించింది.

బాత్ టబ్ లో ఈ అమ్మడు జలకాలాడుతూ షేర్‌ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంకా కూడా ఈ అమ్మడు అత్తారింటికి దారేది సినిమాలో ఎలా అయితే కనిపించిందో ఇప్పటికి కూడా అలాగే కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ప్రణీత ఇలా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం జరుగుతుంది. ముందు ముందు ప్రణీత మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇలాంటి ఫోటోలను చూస్తే అనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు.