బాపు బొమ్మ ప్రణీతకు రెండో సంతానం
అత్తారింటికి దారేది ఫేం ప్రణిత సుభాష్ - నితిన్ రాజు దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు.
By: Tupaki Desk | 5 Sep 2024 3:05 PM GMTఅత్తారింటికి దారేది ఫేం ప్రణిత సుభాష్ - నితిన్ రాజు దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రణిత - నితిన్ 2021లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వివాహం చేసుకున్నారు. 2022లో వారి మొదటి బిడ్డ కుమార్తె అర్నాకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంవత్సరం జూలైలో ప్రణీత తన రెండవ గర్భధారణను ప్రకటించింది. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది. ప్రణీత కొత్త శిశువు జననం గురించి మాట్లాడుతూ `ఓవర్ ది మూన్` అని ఆనందం వ్యక్తం చేసింది.
ప్రణీత ఆరోగ్యం స్థిరంగా ఉంది. నేను గర్భవతిగా ఉన్నప్పుడు అందరి సలహాలను పాటించాను. నాకు ఏమీ తెలియదు. మొదటి బిడ్డ పుట్టే సమయంలో నెమ్మదిగా నేర్చుకున్నాను. గర్భిణిగా నేను నా గురించి.. ఏ సమయంలో ఏం చేయాలి అనేదాని గురించి నాకు కచ్చితంగా తెలుసు కాబట్టి ఇప్పుడు కూల్ గా ఉన్నాను. ఇప్పటికే నిద్రలేని రాత్రులు ఉన్నాయి.. కానీ నేను ప్రక్రియ లో ప్రతి బిట్‌ను ఆస్వాధించాను. ఏదీ నన్ను ఒత్తిడికి గురిచేయలేదు`` అని తెలిపింది.
తన రెండవ గర్భాన్ని ప్రకటించిన తర్వాత ప్రణీత తన ఇన్‌స్టాలో చాలా ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. తన బిడ్డ పుట్టడానికి ముందు ఆగస్టు 23న బెంగళూరులో క్రీమ్ అండ్ లావెండర్ థీమ్ బేబీ షవర్ తో వార్తల్లో నిలిచింది. `గుర్తుంచుకోవడానికి ఒక బేబీ షోవర్ వేడుక` అని తెలిపింది. తన భర్త, కుమార్తె , స్నేహితుల ఫోటోలను ప్రణీత షేర్ చేసింది. ఈ జంట కూడా బిడ్డ పుట్టకముందే బేబీమూన్‌కి వెళ్లి కలిసి విలువైన సమయాన్ని గడిపారు. తమ బేబీమూన్ నుండి ఒక మధురమైన వీడియోను కూడా షేర్ చేసారు.
ప్రణీత వివాహం తర్వాత నటవృత్తి నుండి విరామం తీసుకుంది. ఈ సంవత్సరం తిరిగి కెరీర్ జర్నీని ప్రారంభించింది. మలయాళ చిత్రం థంకమణి , కన్నడ చిత్రం రమణ అవతారలో నటించింది. 2021లో చివరిగా హిందీ చిత్రం `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో కనిపించింది. తెలుగులో బావ చిత్రంతో ప్రణీత కథానాయికగా అడుగుపెట్టింది. ఆ తర్వాత అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్లో నటించింది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు లోను ప్రణీత నటించింది.