Begin typing your search above and press return to search.

ప్ర‌ణీత నుంచి 'రౌండ్-2'..ప్యాంట్ లు స‌రిపోవ్!

ఇలాంటి స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని అభిమానులు అస్సులు ఊహించి ఉండ‌రు.

By:  Tupaki Desk   |   25 July 2024 9:34 AM GMT
ప్ర‌ణీత నుంచి రౌండ్-2..ప్యాంట్ లు స‌రిపోవ్!
X

అందాల హీరోయిన్ ప్ర‌ణీత సుభాష్ మ‌రోసారి గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్ర‌ణీత మళ్లీ త‌ల్లికాబోతుంది. ఇంత‌కాలం ర‌హ‌స్యంగా దాచేసిన విష‌యాన్ని ఇప్పుడు అభిమానుల‌తో సోషల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. ఇలాంటి స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని అభిమానులు అస్సులు ఊహించి ఉండ‌రు. క‌నీసం ఎక్క‌డా హింట్ కూడా ఇవ్వ‌కుండా ఉండ‌ట‌మే ఈ స‌ర్ ప్రైజ్కి కార‌ణం. తన బేబీ బంప్ ఫొటోలు ఇన్ స్టా గ్రామ్‌ లో పోస్ట్ చేసిన ప్రణీత..


'రౌండ్ 2… ఇక నుంచి ప్యాంట్‌లు సరిపోవు' అంటూ చమత్కారంగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్ర‌ణీతి సినీ, ప్ర‌ముఖులు, అభిమానులు, నెటి జ‌నులు అభినంద‌లు తెలుపుతున్నారు. ఓసారి పిక్ లోకి వెళ్తే ఇందులో ప్ర‌ణీత జీన్స్ ప్యాంట్ పై బ్లాక్ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ బ‌నియ‌న్ ధ‌రించింది. బేబిబంప్ ని హైలైట్ చేస్తూ ప‌ట్ట‌ని ప్యాంట్ బ‌ట‌న్ విప్పి నా బేబి ఇదేనంటూ చెప్ప‌క‌నే చెప్పింది.


ప్ర‌ణీత‌-సుభాష్ నితిన్ రాజ్ 2021 మే లో వివాహం చేసుకున్నారు. నితిన్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. క‌రోనా కార‌ణంగా వివాహం సింపుల్ గాజ‌రిగింది. ఈ దంప‌తుల‌కు మొద‌టి సంతానం 2022 లోక‌లిగింది. మొద‌టి కానుపులో ఆడ‌బిడ్డ పుట్టింది. ఆ ఆ పాపకు అర్నా అని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రణీత మరో బిడ్డకు జన్మనివ్వనుంది. మ‌రి ఈసారి బాబు పుడ‌తాడా? పాప పుడుతుందా? అన్న‌ది చూడాలి.


సిద్ధార్థ్ నటించిన `బావ` సినిమాతో ప్ర‌ణీత తెలుగు ఇండస్డ్రీకి పరిచయమైన సంగ‌తి తెలిసిందే. అటుపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `అత్తారింటికి దారేది` సినిమాలో న‌టించింది. ఈ సినిమాతో తెలుగు వారికి బాగా చేరువైంది. అలాగే ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాల్లోనూ నటించింది. కానీ ఆమె ఎక్కువ‌గా సెకెండ్ లీడ్స్ లోనే క‌నిపించింది.