హీరోయిన్‌కు నిద్రలేని రాత్రులు.. కారణమిదే..
`అత్తారింటికి దారేది` ఫేం ప్రణిత సుభాష్ తన రెండవ బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు.
By: Tupaki Desk | 4 Aug 2024 12:26 PM GMT`అత్తారింటికి దారేది` ఫేం ప్రణిత సుభాష్ తన రెండవ బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. సి-సెక్షన్ డెలివరీకి అంతా సిద్ధమైంది. ప్రణీత ఇన్‌స్టాలో తన భర్త, వ్యాపారవేత్త నితిన్ రాజుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి.. గర్భధారణ సమయంలో తన మానసిక పరిస్థితి గురించి వెల్లడించింది. ``నిద్రలేని రాత్రులు.. హార్మోన్ల మార్పులు.. యాసిడ్ రిఫ్లక్స్.. పెల్విక్ నొప్పి.. సి-సెక్షన్ కోసం సిద్ధమవుతున్నా.. నాకు అత్యంత విలువైన వారు నా పక్కన ఉండగానే`` అని రాసింది. సి-సెక్షన్ అనేదానిని సిజేరియన్ అని కూడా పిలుస్తారు. ఇది తల్లి ఉదరం గర్భాశయంలో కోత ద్వారా బిడ్డను ప్రసవించే ప్రక్రియ.
ప్రణిత 2021 మేలో రాజును వివాహం చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత మొదటి బిడ్డ గా కుమార్తెకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో కాన్పునకు రెడీ అవుతోంది. ప్రణిత కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం చిత్రసీమలకు సుపరిచితం. 2010లో దర్శన్ నటించిన కన్నడ చిత్రం `పోర్కి`తో తెరంగేట్రం చేసింది. సిద్ధార్థ్ నటించిన తెలుగు చిత్రం బావలో కనిపించింది. ఆ తర్వాత అరుళ్‌నిధి నటించిన `ఉదయన్` అనే తమిళ చిత్రంలో నటించింది. శగుణి(తెలుగులో శకుని), జరాసంధ, భీమ తీరదల్లి, విజిల్ చిత్రాల్లో నటించింది. బ్రహ్మ, పాండవులు పాండవులు తుమ్మెద, మాస్, డైనమైట్, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో కనిపించింది. పవన్ కల్యాణ్ సరసన నటించిన అత్తారింటికి దారేది బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.
2021లో శిల్పా శెట్టి, పరేష్ రావల్ నటించిన `హంగామా 2`తో ప్రణిత హిందీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం 2003లో వచ్చిన హంగామా చిత్రానికి సీక్వెల్. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, చిత్రనిర్మాత స్వంత 1994 మలయాళ చిత్రం `మిన్నారం` ఆధారంగా రూపొందింది. ఆమె ఆ తర్వాత అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా నటించిన `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో కనిపించింది. ఈ చిత్రం 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో సెట్ చేయబడింది. ఇక్కడ మాదాపర్ గ్రామంలోని 300 మంది స్థానిక మహిళలు దెబ్బతిన్న ల్యాండింగ్ స్ట్రిప్‌ను 72 గంటల్లో పునర్నిర్మించారు.