వెంకీ -త్రినాధరావు ప్రాజెక్ట్ అలా అటకెక్కింది!
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని వార్తలొ స్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 March 2025 2:00 PM ISTవిక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని వార్తలొ స్తున్న సంగతి తెలిసిందే. స్టోరీ ఒకే అయిందని ఈ సమ్మర్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ అగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా రైటర్ ప్రసన్న కుమార్ రివీల్ చేసాడు. 'వెంకటేష్ కి కథ చెప్పిన మాట వాస్తవం. ఆయనకు స్టోరీ బాగా నచ్చింది.
చేద్దామన్నారు. డేట్లు గురించి చెప్పమన్నారు. వెళ్తూ వెళ్తూ అన్నయ్య కి కూడా ఓ సారి స్టోరీ చెప్పండని అన్నారు. ఆయన్ని కలిసి రెండు..మూడుసార్లు చెప్పాం. ఆయన డౌట్లు కూడా క్లియర్ చేసాం. మేం ష్యూర్ గా ఉన్నాం. కాదన్నారు. సరే అయితే అని మరో ఇద్దరు ముగ్గురికి చెప్పాలన్నారు. చెన్నై నుంచి ఒకరు..మరో ఇద్దరికి చెప్పాం. వాళ్లు స్క్రీన్ ప్లే నిపుణులు అనుకుంటా. ఒకే రోజు ముగ్గురికి మూడు నేరేషన్లు ఇచ్చాను.
వాళ్లు అతన్ని గెలక్కపోతేనే బెటర్ అన్నారు. తర్వాత సురేష్ బాబు గారు నేను నా డెసిషన్ల మీద ముందుకు వెళ్తాను. వేరే వాళ్ల నిర్ణయాల మీద కాదన్నారు. మేం ఒకరకమైన కథను నమ్ముతాం. ఆయన దానిమీద కాన్పిడెంట్ గా లేరు. మేం కూడా ముందుకు వెళ్లలేం అనిపించి ఆగిపోయాం` అన్నారు. అలా వెంకీ-త్రినాధ రావు ప్రాజెక్ట్ అటకెక్కింది. త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన సినిమాలకు ప్రసన్న కుమార్ రచన విభాగంలో కీలక పాత్ర ధారి అన్న సంగతి తెలిసిందే.
త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన 'సినిమా చూపిస్త మావ','నేను లోకల్', 'హలో గురూ ప్రేమ కోసమే','ధమాకా','మజాకా' చిత్రాలకు స్టోరీ అందించారు. 'దాస్ కా దమ్కీ', 'నా సామిరంగ' స్టోరీలు కూడా ప్రసన్న కుమారువే. స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గాను మంచి పేరుంది.