Begin typing your search above and press return to search.

ప్రసన్నవదనం టీజర్.. సుహాస్ కు వింత రోగం

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన టాలెంట్ తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోల్లో సుహాస్ ఒకరు

By:  Tupaki Desk   |   7 March 2024 7:30 AM GMT
ప్రసన్నవదనం టీజర్.. సుహాస్ కు వింత రోగం
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన టాలెంట్ తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోల్లో సుహాస్ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సుహాస్.. సినిమాల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్నారు. గతేడాది రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టిన కొట్టిన ఈ కుర్ర హీరో.. ఇటీవల అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో సినీ ప్రియులను అలరించారు.

ఇటీవల విడుదలైన ఈ మూవీ.. సాలిడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. మార్చి 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి ఐదు రోజుల్లోనే 10 కోట్ల నిమిషాల మార్క్ అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక వరుస సినిమాలతో అలరిస్తున్న సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం. ఫస్ట్ లుక్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజైంది.

తలకు కట్టుతో ఆస్పత్రిలో సుహాస్ ఉన్న సీన్ తో టీజర్ ప్రారంభమైంది. తన తల్లిదండ్రులను కూడా హీరో గుర్తుపట్టలేకపోతాడు. ఫేస్ బ్లైండ్ నెస్ తో హీరో బాధపడుతున్నట్లు డాక్టర్ చెబుతాడు. అయితే మధ్యలో సినిమాలోని చాలా పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. ప్రతీ సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. కానీ స్టోరీ లైన్ ఎక్కడా రివీల్ అవ్వకుండా మేకర్స్ టీజర్ ను కట్ చేశారు.

నార్మల్ గా సుహాస్ చిత్రాల్లో కంటెంట్ రిచ్ గా ఉంటుంది. ప్రసన్న వదనం టీజర్ చూశాక అది మరోసారి రుజువయింది. సస్పెన్స్ థ్రిల్లర్ కు ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ ను ఆసక్తికరంగా జోడించారు మేకర్స్. టీజర్ లో సుహాస్, మిగతా పాత్రల చుట్టూ ఉన్న సస్పెన్స్ క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రాన్ని ప్రసన్నవదనం అనే టైటిల్ ఎందుకు పెట్టారో టీజర్ చూశాక కొంత క్లారిటీ వచ్చింది.

సుహాస్ పాత్రను మేకర్స్ డిజైన్ చేసిన తీరు చాలా యూనిక్ గా ఉంది. ఎప్పటిలానే తన పెర్ఫార్మెన్స్ తో సుహాస్ అదరగొట్టేశారు. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సస్పెన్స్ ను మరింత ఎలివేట్ చేసింది. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ వైకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తెలుగు సినిమాలకు ఎన్ని కాన్సెప్ట్ లు కూడా సరిపోవడం లేదని, కొత్త కొత్త జబ్బులు వెతికి మరీ పట్టుకుంటున్నారని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.