ప్రశాంత్ వర్మ లిస్టులో ఎన్ని కథలో..
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 20 Nov 2024 5:00 AM GMTయంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత అతని రేంజ్ కూడా పెరిగిపోయింది. దర్శకుడిగా అతని లైన్ అప్ లో ‘జై హనుమాన్’ మూవీతో పాటు మోక్షజ్ఞ డెబ్యూ చిత్రం కూడా ఉంది. ఈ రెండు సినిమాలు రెండేళ్లలోనే ఫినిష్ చేసే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నారు. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులో సూపర్ హీరో కథలని తెరపై చూపించే ప్రయత్నం మొదలెట్టాడు.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేయబోయే సినిమాలు అన్ని కూడా అందులోనే రానున్నాయి. ఆయన దర్శకుడిగా కాకుండా కథ అందించిన సినిమాలతో ‘అధీరా’, ‘మహాకాళి’ చిత్రం సూపర్ హీరో కాన్సెప్ట్ లతోనే తెరకెక్కుతున్నాయి. వీటిని వేరొక దర్శకులతో చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ కథ అందించిన ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. గల్లా అశోక్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో మూవీ తెరకెక్కింది.
ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ వైపు దర్శకుడిగా మూవీస్ చేస్తూ ఇన్ని కథలు రాసే టైం ఎలా దొరుకుతుందని యాంకర్ సుమ ప్రశాంత్ వర్మని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ నేను ఫస్ట్ సినిమా చేసే ముందే 33 కథలు రాసేసుకున్నాను. అందులో మీ అబ్బాయి రోషన్ కి ఒక కథ చెప్పాను. దానికి మీరు ఇంకా యాక్సప్ట్ చెప్పాల్సి ఉంది అని సుమతో అన్నాడు.
అవకాశం ఉంటే డైరెక్షన్ మానేసి కథలు రాసుకుంటాను. కథలు రాయడం అంటేనే నాకు ఇష్టం. ఇప్పుడు చేస్తోన్న సినిమాలలో ఆ 33 కథలు ఇంకా రాలేదు. కావాలంటే బోయపాటి గారికి కథ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటూ ప్రశాంత్ వర్మ సరదాగా చెప్పారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం ఆరు సూపర్ హీరో స్టోరీస్ సిద్ధమై ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పాడు. అలాగే మా టీమ్ కూడా కొత్త కథలపై వర్క్ చేస్తుందని క్లారిటీ ఇచ్చాడు.
మొత్తానికి ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో చాలా మందికి సరిపోయే స్టోరీ బ్యాంకుని సిద్ధం చేసుకున్నాడని ఆయన మాటల బట్టి అర్ధమవుతోంది. భవిష్యత్తులో కచ్చితంగా ప్రశాంత్ వర్మ కథలతో చాలా మంది దర్శకులు సినిమాలు చేసే అవకాశం కూడా ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ అడిగినట్లు బోయపాటి ఏమైనా అతని నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కథ తీసుకుంటాడా అనేది కూడా చూడాలి.