Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ.. ఈ ఒక్క టాస్క్ లో గెలిస్తే..

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాది ‘హనుమాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   4 Nov 2024 9:30 AM GMT
ప్రశాంత్ వర్మ.. ఈ ఒక్క టాస్క్ లో గెలిస్తే..
X

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాది ‘హనుమాన్’ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులో సూపర్ హీరో కథలతో మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందులో మొదటి చిత్రంగా ‘హనుమాన్’ వచ్చింది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ‘హనుమాన్’ మూవీ క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చాడు.

‘జై హనుమాన్’ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం రిషబ్ శెట్టిని తీసుకున్నారు. దీపావళి సందర్భంగా ‘హనుమాన్’ క్యారెక్టర్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హనుమంతుడి క్యారెక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడని ఈ పోస్టర్ బట్టి అర్ధమైంది. హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాట ఏంటనేది ఈ ‘జై హనుమాన్’ కథలో ప్రశాంత్ వర్మ చూపిస్తాడని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘హనుమాన్’ మూవీ కథాంశంలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా క్లైమాక్స్ ఎపిసోడ్ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. ‘జై హనుమాన్’ సినిమాని విజువల్ స్పెక్టాక్యులస్ గా తెరపై ఆవిష్కరించాల్సి ఉంటుంది. కచ్చితంగా ఇది ప్రశాంత్ వర్మకి కత్తి మీద సాములాంటిది. ప్రజల మనోభావాల్ని కూడా దృష్టిలో ఉంచుకొని ‘జై హనుమాన్’ కథని ప్రశాంత్ వర్మ చెప్పాల్సి ఉంటుంది.

అలాగే రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రకి ఏ మేరకు న్యాయం చేస్తాడనేది కూడా పబ్లిక్ చూస్తారు. ‘జై హనుమాన్’ మూవీ క్లైమాక్స్ లో శ్రీరాముడి పాత్రని ఏమైనా చూపిస్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఒక వేళ శ్రీరాముడి క్యారెక్టర్ ని రివీల్ చేస్తే ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. లేదంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న AI టెక్నాలజీ ఉపయోగించి శ్రీరాముడి క్యారెక్టర్ ని సృష్టిస్తారా అనేది కూడా చూడాలి.

‘జై హనుమాన్’ మూవీ హిట్ అయితే మాత్రం కచ్చితంగా ప్రశాంత్ వర్మ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోతుంది. స్టార్ హీరోలు అందరూ అతని సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కావడానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంటుంది. అసలే ప్రభాస్ అంటున్నారు. ఇక ఆయనకు కథ చెబితే వెంటనే ఓకే చెప్పే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ తనని తాను ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటాడనేది వేచి చూడాలి.