ప్రశాంత్ వర్మ బ్యాక్ టూ పెవిలీయన్!
ఇంకా యువ హీరోల నుంచి కొంత మంది సీనియర్ స్టార్ హీరోల వరకూ ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించారు.
By: Tupaki Desk | 14 Dec 2024 1:30 PM GMT`హను మాన్` హిట్ తో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియాలో సంచలనం అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా సంచలనాలు నమోదు చేయడంతో? అవకాశాలన్ని ఒక్కసారిగా తన ఇంటి ముందు క్యూ కట్టాయి. తనయుడు మోక్షజ్ఞని బాలయ్య ప్రశాంత్ వర్మ చేతుల్లో పెట్టాడు. హనుమాన్ పాత్ర నా కొస్తే చేయడానికి సిద్దం అని మెగాస్టార్ చిరంజీవి సైతం అన్నారు. ఇంకా యువ హీరోల నుంచి కొంత మంది సీనియర్ స్టార్ హీరోల వరకూ ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించారు.
అయితే అనూహ్యంగా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లోకి కన్నడ నటుడు రిషబ్ శెట్టిని తెరపైకి తెచ్చాడు. హనుమంతుడి పాత్ర బాధ్యతల ఆయనకు అప్పగించడం జరిగింది. అలాగే మోక్షజ్ఞతో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో జై హమనుమాన్ ని తాత్కాలికంగా పక్కనబెట్టి మోక్షజ్ఞ చిత్రంపై దృష్టి పెట్టాడు వర్మ. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రద్దు అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రశాంత్ వర్మ చేతుల్లో నుంచి ఆ ప్రాజెక్ట్ మరో డైరెక్టర్ చేతుల్లోకి వెళ్తున్నట్లు కొన్ని రోజులు గా ప్రచారం జరుగుతోంది. నాగ్ అశ్విన్ ఆ బాధ్యతలు తీసుకుంటున్నట్లు వినిపిస్తుంది. దీంతో ప్రశాంత్ వర్మ మళ్లీ `జై హనుమాన్` ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పడట్లు సమాచారం. మధ్యలోనే వదిలేసిన జైహనుమాన్ పనులు మళ్లీ పున ప్రారంభిస్తున్నారట. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ కారణంగా ప్రశాంత్ వర్మకి కొంత సమయం వృద్ధా అయినట్లు తెలుస్తోంది. అవకాశం ఇచ్చి మళ్లీ లాగేసుకో వడం అన్నది జీర్ణించుకోలేని విషయమే.
మోక్షజ్ఞని డైరెక్ట్ చేస్తానని ప్రశాంత్ వర్మ అడిగింది లేదు. ఆ ఛాన్స్ కోసం అతడు ఆరాట పడింది లేదు. ప్రశాంత్ వర్మని మధ్య లోకి లాగింది ఒకరు. ఆయనే అవకాశం ఇచ్చారు. మళ్లీ ఆయనే వెనక్కి లాక్కున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.