Begin typing your search above and press return to search.

హనుమాన్ తో కొట్టాడు కానీ.. మిగతాదంతా ప్చ్!!

2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Dec 2024 11:30 PM GMT
హనుమాన్ తో కొట్టాడు కానీ.. మిగతాదంతా ప్చ్!!
X

2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. యువ నటుడు తేజ సజ్జా లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్క్ తెరకెక్కించిన ఆ సినిమా.. ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంది. చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. పెద్ద హిట్ గా నిలిచి సత్తా చాటింది.

సంక్రాంతికి బరిలో దిగిన పలు బడా చిత్రాలతో పోటీ పడి మరీ విన్నర్ గా నిలిచింది. భారీ వసూళ్లను రాబట్టి మేకర్స్ కు మంచి లాభాలు అందించింది. సంక్రాంతి సీజన్ సినిమాల ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. పాన్ ఇండియా లెవెల్ లో ఆయనకు ఉన్న క్రేజ్ పెంచేలా చేసింది.

దీంతో ఆయన అప్ కమింగ్ మూవీలపై అందరి దృష్టి పడింది. అయితే ప్రశాంత్ వర్మకు 2024 స్టార్టింగ్ లో హనుమాన్ తో మంచి సక్సెస్ దక్కింది. కానీ ఏడాదంతా కెరీర్ విషయంలో నిరాశ ఎదురైంది! రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ స్టోరీ అందించడంతో అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ మూవీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఆగిపోయింది. దాని వెనుక కారణాలేమైనా ప్రశాంత్ వర్మ.. ఓ సినిమాను మిస్ అయ్యారు.

ఆ తర్వాత రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సింబా ఈజ్ కమింగ్ అంటూ అభిమానుల్లో ఆశ‌లు రేపారు వర్మ. కానీ ఇంకా ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఆగిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదని బాలయ్య కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ తో పాటు మరిన్ని చిత్రాలు ప్రశాంత్ వర్మ లైనప్ లో ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే చివరగా.. 2024 ఇయర్ ప్రశాంత్ వర్మకు మంచి సక్సెస్ అందించినప్పటికీ.. పలు విషయాల్లో మాత్రం నిరాశ పరిచేలా చేసింది. మరి ఆయన కెరీర్ లైఫ్ లో 2025 ఎలా ఉంటుందో వేచి చూడాలి.