పట్టువిడువని ప్రశాంత్ వర్మ.. ఆ స్టార్ దొరికేనా?
యంగ్ టైగర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.
By: Tupaki Desk | 14 Dec 2024 11:01 AM GMTయంగ్ టైగర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. పాన్ ఇండియా రేంజ్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో వెంటనే దానికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఆరంభంలో ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం హీరోలు దొరకలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టి రణవీర్ సింగ్ తో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. అతనికి కథ చెప్పి ఒకే చేయించుకున్నాడు.
ఈ సినిమా పట్టాలు ఎక్కే సమయంలో క్యాన్సిల్ అయ్యింది. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ రద్దయ్యిందని క్లారిటీ వచ్చింది. తరువాత నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే సూపర్ హీరో కథతోనే ఈ సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయడంతో ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి షూటింగ్ ని వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
100 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి నిర్మాతలు కూడా సిద్ధమయ్యారు. అయితే షూటింగ్ మొదలవుతుందనుకునే రోజే సడెన్ గా మూవీ హోల్డ్ లో పడిందనే టాక్ బయటకొచ్చింది. మోక్షజ్ఞ ఆరోగ్యం బాగోకపోవడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని బాలయ్య చెప్పారు. అయితే అంతర్గతంగా ఇంకేదో జరిగిందనే మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకుంటున్నారు.
వాస్తవం ఏంటనేది బయటకి రాలేదు. మరో వైపు ‘జై హనుమాన్’ కోసం రిషబ్ శెట్టిని మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతారా 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాకే ‘జై హనుమాన్’ స్టార్ట్ చేస్తారు. ఈ లోపు డార్లింగ్ ప్రభాస్ తో కథ ఫైనల్ చేయించుకోవాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారంట. ఇదివరకే రెండు మూడు సార్లు కలిశారు. కానీ కథ విషయంలో ప్రభాస్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని టాక్. అయినప్పటికీ మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
వీలైనంత వేగంగా ప్రభాస్ ని ఒప్పించి ఈ సినిమా అయిన పట్టాలు ఎక్కించాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ కథ విషయంలో ప్రభాస్ నిర్మాతలు సంతృప్తి చెందితే జనవరిలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక కన్ఫర్మేషన్ రావొచ్చని అనుకుంటున్నారు. ఇక ప్రభాస్ లైనప్ చాలా బిజీగా వుంది. ప్లాన్ చేసినా డేట్స్ దొరకడం అంత ఈజీ కాదు. ఇక రిషబ్ శెట్టి ఈ మూవీకి కథ అందించాడని ప్రచారం జరుగుతోంది. అయితే అందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. ఈ సినిమాని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.