Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ.. ఏంటా చాలెంజ్?

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Sep 2024 2:44 PM GMT
ప్రశాంత్ వర్మ.. ఏంటా చాలెంజ్?
X

ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌ గురించి ప్రకటించిన తర్వాత బాలీవుడ్ లో రణ్వీర్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అది మొదట్లోనే క్యాన్సిల్ అయ్యింది. తాజాగా ఆయన మోక్షజ్ఞ నందమూరి కి సంబంధించిన ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ లాంచింగ్ ఈవెంట్ జరగబోతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అఫీషియల్ క్లారిటీ రాకపోయినప్పటికి ఈ కాంబినేషన్ ఫైనల్ అని ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపధ్యంలో, ప్రశాంత్ వర్మ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు, ఇది ప్రేక్షకులలో మరియు సినీ ప్రేమికుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఆయన ఒక ఫోటోను షేర్ చేస్తూ “చాలెంజ్ స్వీకరించబడింది” అని ట్వీట్ చేశారు.

ఇది ఎంతవరకు మోక్షజ్ఞ డెబ్యూ సినిమా సంబంధమా లేదా ‘హనుమాన్’ సీక్వెల్ గురించి ఉద్దేశించినదా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ కథలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపిస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ ఈ సినిమాలో కృష్ణుడిగా దర్శనమివ్వబోతున్నారని లేటెస్ట్ గా వస్తున్న మరొక టాక్.

‘హనుమాన్’ సినిమాలో ఉన్న మైథలాజికల్ టచ్, సూపర్ హీరో అంశాలను, ఈ సినిమాకు కూడా అన్వయించనున్నట్లు సమాచారం. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఈ కొత్త కథలో కూడా సూపర్ హీరో మరియు మైథలాజికల్ అంశాలను మిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే, బాలకృష్ణ శ్రీకృష్ణుడిగా కనిపించడంతో, కథలో మరొక కీలక మలుపు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

స్క్రిప్ట్ దాదాపు సిద్ధమైనట్లే అని తెలుస్తోంది. బాలకృష్ణకు మరోసారి చర్చలు జరిపిన తరువాత, అన్ని పనులు స్టార్ట్ అవుతాయనీ అంచనా వేస్తున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ సినిమాతో సంబంధించి త్వరలో ఓ క్రేజీ అప్‌డేట్ కూడా రాబోతోంది. ప్రశాంత్ వర్మ చేసే ఈ కొత్త ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మాములుగా లేవు. ఈ ప్రాజెక్ట్ పై మరింత స్పష్టత వచ్చే వరకు గాసిప్స్ ఒక రేంజ్ లో వస్తాయని చెప్పవచ్చు. మరి వాటిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.