Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ… అసలు సర్ ప్రైజ్ ముందుంది

‘హనుమాన్’ సీక్వెల్ గా ‘జై హనుమాన్’ మూవీ ఉండబోతోందని గతంలోనే స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 6:55 AM GMT
ప్రశాంత్ వర్మ… అసలు సర్ ప్రైజ్ ముందుంది
X

‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా మూవీస్ ని లైన్ అప్ లో పెట్టారు. ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అలాగే దాసరి కళ్యాణ్ తో ‘అధీరా’ అనే ప్రాజెక్ట్ గతంలో ఎనౌన్స్ చేశారు. రీసెంట్ గా ‘మహాకాళి’ అనే సినిమాని కన్ఫర్మ్ చేశారు. ఇలా లైన్ లో మూడు సినిమాలు ఉండగా ఇప్పుడు ‘హనుమాన్’ సీక్వెల్ ని కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

‘హనుమాన్’ సీక్వెల్ గా ‘జై హనుమాన్’ మూవీ ఉండబోతోందని గతంలోనే స్పష్టం చేశారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. తాజాగా ప్రశాంత్ వర్మ ట్విట్టర్ లో ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అందులో రెండు ఫోటోలు షేర్ చేశారు. అందులో ఒక ఫోటోలో మేడలో బ్యాగ్ తగిలించుకొని కోతిని చూస్తున్నాడు.

మరో ఫోటోలో మెట్ల మీద కూర్చొని కోతికి వాటర్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఫోటోలు పెట్టి సో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఇది ఒక సంకేతం అని ట్వీట్ చేశారు. దానికి దివాలీస్ కమింగ్ అనే హాష్ ట్యాగ్ జత చేశారు. దీనిని బట్టి ‘జై హనుమాన్’ కి సంబందించిన అప్డేట్ ని దీపావళి రోజు ఇవ్వబోతున్నారనే విషయాన్ని ప్రశాంత్ వర్మ పరోక్షంగా చెప్పారని అందరూ భావిస్తున్నారు. ఆ రోజు రిషబ్ శెట్టితో ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

ఇదిలా ఉంటే ‘కాంతార చాప్టర్ 2’ తర్వాత రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’ మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. అయితే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ చిత్రాన్ని కంప్లీట్ చేసి ‘జై హనుమాన్’ స్టార్ట్ చేస్తాడా లేదంటే ముందుగానే ఫినిష్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ‘హనుమాన్’ కి సీక్వెల్ గా రాబోయే చిత్రం కావడంతో ‘జై హనుమాన్’ పైన క్రేజ్ ఉంది. దానిని ప్రశాంత్ వర్మ ఏ స్థాయిలో ముందుకి తీసుకొని వెళ్తాడనేది చూడాలి.