Begin typing your search above and press return to search.

హనుమాన్ డైరెక్టర్ తో ఆ స్టార్ లైన్ క్లియర్ అయినట్టే..!

బాలయ్య బాబు చేసిన అన్ స్టాపబుల్ షో ప్రోమోస్ అన్నీ కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఆ టైం లోనే అతని టాలెంట్ చూసి బాలకృష్ణ సర్ ప్రైజ్ అయ్యారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 10:30 AM GMT
హనుమాన్ డైరెక్టర్ తో ఆ స్టార్ లైన్ క్లియర్ అయినట్టే..!
X

మొదటి సినిమా అ! నుంచి దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుతూ వస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా సూపర్ అనేయగా.. సెలబ్రిటీస్ కూడా పర్ఫెక్ట్ అంటున్నారు. సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ సూపర్ కాన్ఫిడెన్స్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. సంక్రాంతికి స్టార్ సినిమాల మధ్య ఒంటరిగా రిలీజైన హనుమాన్ అందులోని కంటెంట్ తో ఆడియన్స్ ని తనవైపుకు తిప్పుకుంది.

హనుమాన్ సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రశాంత్ వర్మ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. హనుమాన్ తర్వాత వెంటనే జై హనుమాన్ అనే సినిమా చేస్తున్న ప్రశాంత్ వమ ఆ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. హనుమాన్ ఎండింగ్ లో జై హనుమాన్ అంటూ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ప్రశాంత్ వర్మ ఆ మూవీని కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తాడని తెలుస్తుంది. జై హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ దాదాపు బాలకృష్ణతో సినిమా కన్ ఫర్మ్ అని అంటున్నారు.

బాలయ్య బాబు చేసిన అన్ స్టాపబుల్ షో ప్రోమోస్ అన్నీ కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఆ టైం లోనే అతని టాలెంట్ చూసి బాలకృష్ణ సర్ ప్రైజ్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా హనుమాన్ సినిమాను కూడా బాలకృష్ణ కోసం స్పెషల్ ప్రీమియర్ వేసి చూపించారు. చిత్ర యూనిట్ ని బాలకృష్ణ ప్రశంసించారు. అంతేకాదు జై హనుమాన్ సినిమా కోసం వెయిటింగ్ అని కూడా అన్నారు. హనుమాన్ సినిమా పై బాలకృష్ణ రెస్పాన్స్ చూసిన ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మ సినిమాకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని చెప్పుకుంటున్నారు.

టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో స్టార్స్ అంతా ముందుంటారు. బాలకృష్ణ కూడా ప్రశాంత్ వర్మ తో సినిమాకు ఓకే అనేసినట్టే అని చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు యువ హీరోలతో చేశాడు. కల్కి సినిమాతో రాజశేఖర్ తో చేసినా ఆయన కూడా ఫాం లో లేడు కాబట్టి అలా నడిచిపోయింది. జై హనుమాన్ తర్వాత బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ చేస్తే కెరీర్ లో ఫస్ట్ టైం స్టార్ హీరోతో సినిమా చేసినట్టు అవుతుంది. మరి బాలయ్యతో ప్రశాంత్ వర్మ లైన్ క్లియర్ అయినట్టేనా లేదా ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.