Begin typing your search above and press return to search.

హనుమాన్.. ఇదే అసలు కాన్ఫిడెన్స్!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Dec 2023 3:08 PM GMT
హనుమాన్.. ఇదే అసలు కాన్ఫిడెన్స్!
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జనవరి 12న పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో సూపర్ హిట్ మూవీగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కించారు. మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

హనుమాన్ పవర్స్ ఒక సామాన్యుడికి వస్తే ఎలా ఉంటుంది. ఆ పవర్ ని దక్కించుకోవాలని అన్వేషణ చేస్తోన్న విలన్ గా వినిని చాలా పవర్ ఫుల్ గా ట్రైలర్ లో రిప్రజెంట్ చేశారు. అంజనాద్రి అనే గ్రామంలో జరిగే కథగా చూపిస్తున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి ప్రశాంత్ వర్మ చాలా కాన్ఫిడెంట్ గా సమాధానాలు చెప్పారు.

నేను, సినిమాలో హీరో తేజ చాలా చిన్న వాళ్ళమని అయితే తమ సినిమా హనుమాన్ మాత్రం చాలా పెద్దదని, ఆ నమ్మకంతోనే సంక్రాంతి బరిలో దిగుతున్నామని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. అలాగే అందరికంటే ముందుగా మేము రిలీజ్ డేట్ ఫిక్స్ చేశామని, నార్త్ ఇండియాలో బిజినెస్ కూడా సంక్రాంతి 12 రిలీజ్ అని చెప్పి చేయడం జరిగిందని అన్నారు.

రిలీజ్ డేట్ ని ముందుగానే అందరికి చెప్పడం వలన మార్చడానికి కుదరదని కూడా క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ అభిమాన స్టార్స్ కాబట్టి గుంటూరు కారం సినిమా మేము ముందుగా చూస్తామని ప్రశాంత్ వర్మ చెప్పడం విశేషం. అలాగే మా కథపై మాకు నమ్మకం ఉందని అన్నారు.

ఆదిపురుష్ రిలీజ్ తర్వాత ఏమైనా ఒత్తిడి పెరిగిందా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అస్సలు లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ముందు నుంచి కాన్ఫిడెంట్ గా సినిమా చేస్తున్నామని, టీజర్ రిలీజ్ అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా అవసరం అని భావించి మరింత ఎక్కువ బడ్జెట్ పెట్టి వర్క్ చేయడం జరిగిందని తెలిపారు. ఏ రోజు కూడా ఒత్తిడికి లోను కాలేదని క్లారిటీ ఇచ్చాడు.