ఆదిత్య 369...బైరవ ద్వీపం రేంజ్ లో!
బాలయ్య ఆ రెండు తరహా సినిమాలు చేస్తే బాగుంటుందని..రఫ్ గా తన దగ్గర ఐడియా కూడా ఉందని అన్నారు.
By: Tupaki Desk | 11 Jan 2024 2:30 PM GMTనటసింహ కెరీర్ లో 'ఆదిత్య 369' లాంటి ప్రయోగాత్మక చిత్రం...'బైరవద్వీపం' లాంటి సోషియా ఫాంటసీ చిత్రం ఎంత గొప్ప సినిమాలు అన్నది చెప్పాల్సిన పనిలేదు. మొత్తం బాలయ్య కెరీర్ లోనే గొప్ప చిత్రాలుగా ఆ రెండిటినీ భావిస్తారాయన. మళ్లీ అలాంటి సినిమాలు రావాలంటే ఆ దర్శకులే వాటికి సీక్వెల్స్ రాస్తే తప్ప సాధ్యం కానిది. అలాంటి అద్భుతాలు కేవలం కొందరికే సాధ్యమవుతాయి.
ఆ విషయంలో బాలయ్య ఎంతో లక్కీ హీరో. ఆ రెండు సినిమాల తర్వాత బాలయ్య అలాంటి ప్రయోగాలు మళ్లీ చేసింది లేదు. ఆమధ్య ఆదిత్య 369 కి సీక్వెల్ తీసే ఆలోచనల్లో ఉన్నట్లు సింగీతం శ్రీనివాసరావు ప్రకటించారు. బాలయ్య కూడా ఆమోదించారు. కానీ ఎందుకనో సాధ్యపడలేదు. 'బైరవ ద్వీపం' లాంటి సోషియా ఫాంటసీ ఆలోచన అయితే ఏ దర్శకుడికి ఇంతవరకూ రాను కూడా లేదు.
అయితే ఆ తరహా సినిమాలు చేయాలని ఉందని తాజాగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. బాలయ్య ఆ రెండు తరహా సినిమాలు చేస్తే బాగుంటుందని..రఫ్ గా తన దగ్గర ఐడియా కూడా ఉందని అన్నారు. బాలయ్య కూడా రెడీగా ఉన్నట్లు తెలిపాడు. బాలయ్య లుక్ కి సంబంధించి కొన్ని రకాల డిజైన్స్ ...ఆ వాతావరణం క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో? రఫ్ గా తన దగ్గర డిజైన్స్ కూడా సిద్దం చేసుకుని పెట్టుకున్నట్లు తెలిపాడు.
హనుమాన్ రిలీజ్ తర్వాత తానే స్వయంగా బాలయ్య వద్దకు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుతానని అన్నారు. తన ప్రతిభని బాలయ్య ముందే గుర్తించారని....కానీ తాను ఇంకా అన్ని రకాలుగా అర్హుడిని కాదనే ఉద్దేశంతోనే ఆగుతున్నట్లు తెలిపాడు. యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ యూనిక్ అని తొలి సినిమా 'అ'తో నే నిరూపించాడు.కల్కి..జాంబిరెడ్డి లాంటి సినిమాలు ప్రశాంత్ కి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
క్రియేటివ్ మేకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకున్నాడు. బాలయ్య కూడా ప్రయోగాలకు వెనుకాడరు కాబట్టి ప్రశాంత్ నుంచి ఎప్పుడైనా గుడ్ న్యూస్ రావొచ్చు.