Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ.. మాస్ కాంబినేషన్

అంతలో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ చిత్రం ఆగిపోయిందని ప్రశాంత్ వర్మ టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. దీనిపై రణవీర్ సింగ్ కూడా ఓపెన్ అయ్యారు

By:  Tupaki Desk   |   29 Jun 2024 12:37 PM GMT
ప్రశాంత్ వర్మ.. మాస్ కాంబినేషన్
X

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ జై హనుమాన్ టైటిల్ తో సీక్వెల్ చేయాలని అనుకున్నారు. అయితే ఎందుకనో సడెన్ గా ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి రణవీర్ సింగ్ తో ఒక సూపర్ హీరో మూవీని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అంతలో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ చిత్రం ఆగిపోయిందని ప్రశాంత్ వర్మ టీమ్ నుంచి క్లారిటీ వచ్చింది. దీనిపై రణవీర్ సింగ్ కూడా ఓపెన్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ మరో హీరోతో సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారంట. మాస్ మహారాజ్ రవితేజతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. హనుమాన్ సినిమాలో ఓ కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ మూవీలో చాలా కీలకంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కి సంబందించిన బ్యాక్ స్టోరీతో ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ రెడీ చేసారంట. రవితేజకి కూడా స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీని చేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలో ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంట. అసలు రవితేజ కోతిగా ఎందుకు మారాడు అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ప్రశాంత్ వర్మ చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యేంత వరకు తెలియదు.

ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని సూపర్ హీరో సినిమాలు చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే రవితేజతో సినిమాని కూడా ఎనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా ప్రకటించే వరకు తెలియదు. ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత మరికొంత మంది దర్శకులు లైన్ లో ఉన్నారు. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ముందుగా సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది.