Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ 'ఆశీర్వాదం' పంచ్ ఆ హీరోకేనా...!

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ జాబితాలో కొత్తగా చేసిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.

By:  Tupaki Desk   |   8 July 2024 7:31 AM GMT
ప్రశాంత్ వర్మ ఆశీర్వాదం పంచ్ ఆ హీరోకేనా...!
X

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌ జాబితాలో కొత్తగా చేసిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఈయన మొదటి సినిమా నుంచి కూడా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడంతో పాటు, భలే తీశాడే అనిపించుకుంటూ ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన హనుమాన్‌ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హనుమాన్‌ విడుదల అయిన వెంటనే పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మకి గుర్తింపు లభించింది. మన దర్శకుల వైపు చూస్తున్న హిందీ హీరోలు ప్రశాంత్‌ వర్మ తో వర్క్ చేయడానికి ఆసక్తి చూపించారు. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రశాంత్‌ వర్మ తో సినిమాకు ఓకే చెప్పాడు.

రణ్‌వీర్ సింగ్‌ తో తన వద్ద అప్పటికే ఉన్న 'రాక్షసుడు' కథ తో సినిమాను చేసేందుకు సిద్ధం అయ్యాడు. స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుందని, త్వరలోనే షూటింగ్‌ అంటూ రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. కానీ సినిమా ఆరంభం కాకుండానే అటకెక్కిందని, హీరో మరియు దర్శకుడి మధ్య క్రియేటివ్‌ డిఫెరెన్స్‌ రావడం వల్ల ఆగి పోయిందని తెలుస్తోంది.

ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసిన ఒక పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందులో ప్రతి తిరస్కరణ ఓ ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు అంటూ పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌ బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్ కు తగులుతుందని, కావాలని ప్రశాంత్‌ వర్మ ఈ పోస్ట్ పెట్టాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రాక్షసుడు సినిమా ను దాదాపుగా ఆపేసినట్లే అంటూ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. కనుక హనుమాన్‌ సీక్వెల్‌ జై హనుమాన్‌ ను ప్రశాంత్‌ వర్మ మొదలు పెడితే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ప్రశాంత్‌ వర్మ ఆలోచన ఏంటి? మళ్లీ బాలీవుడ్‌ లోనే హీరోను మెప్పించి అక్కడే రాక్షసుడు చేస్తాడా అనేది చూడాలి.