ప్రభాస్ అన్నయ్యతో చెల్లెళ్లు అంతా ఇలా!
తాజాగా నేడు డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా చెల్లెళ్లు అంతా విషెస్ తెలియజేసారు. వాళ్లందరిలో ఎక్కువగా మీడియాలో ప్రసీద హైలైట్ అవుతుంటుంది.
By: Tupaki Desk | 23 Oct 2024 6:57 AM GMTపెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్ కి ఎంతో ఇష్టం. ప్రభాస్ అన్నా కృష్ణంరాజు అంతే ఇష్టపడతారు. ఆయన వారసత్వాన్ని అందుకునే ప్రభాస్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. పెదనాన్న సూచనలు, సలహాలతోనే ఇంతకాలం ముందుకు సాగాడు. అలా బ్యాక్ బోన్ గా నిలిచిన పెదనాన్న కృష్ణంరాజు ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. పెద్దమ్మ శ్యామాలా దేవి...వాళ్ల పిల్లల్ని సొంత చెల్లెళ్లుగా భావిస్తాడు. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఖాళీ సమయాన్ని వాళ్లతోనే గడుపుతాడు.
ఉంటే సెట్స్ లో...లేదంటే వెకేషన్ లో...ఈ రెండు లేవంటే కృష్ణంరాజు ఇంట్లోనే ఎక్కువగా ఉంటారు. ఆయన నలుగురు అమ్మాయిలతోనే ఇంట్లో ఆట పాటలతో టైంపాస్ చేస్తుంటాడు. తాజాగా నేడు డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా చెల్లెళ్లు అంతా విషెస్ తెలియజేసారు. వాళ్లందరిలో ఎక్కువగా మీడియాలో ప్రసీద హైలైట్ అవుతుంటుంది. ఎక్కువగా ప్రభాస్ విషయాలు తనే చెబుతుంటుంది.
తాజాగా చెల్లెళ్లు అందరితో ప్రభాస్ దిగిన పాత ఫోటోలు కొన్నింటిని ప్రసీద షేర్ చేసింది. అప్పుడు ఆ చెల్లెళ్లు అంతా అమ్మ-నాన్న ..అన్నయ్య ఒడిలో కూర్చుని ఆడుకుంటోన్న వయసు అది. చిన్నప్పుడు చెల్లెళ్లు అంతా అన్నకి రాకీ కడుతోన్న కొన్ని ఫోటోలు..అలాగే వారు పెరిగి పెద్దన ఫోటోలుషేర్ చేసి ప్రసీద అన్నయ్యకి విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాత ఫోటోలకు ఇన్ స్టాలో మంచి క్రేజ్ ఉంటుంది.
చిన్న వయసులో ఎలా ఉంటారు? అనే ఉత్సాహంతో అభిమానులు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి ఫోటోలు బయటకు వస్తే ఊరుకుంటారా? షేర్ చేసి..వాటిపై కామెంట్లు చేసి అభిమానం చాటుకుంటున్నారు. ప్రసీద అన్నయ్యతో దిగిన ఓ స్పెషల్ ఫోటోని షేర్ చేసింది. అందులో ప్రభాస్ చెల్లెలు ఎంతో ప్రేమానురాగలతో గార్డెన్ లో జోకులేసుకుని వాక్ చేస్తున్నారు.