Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ..అసలు డైరెక్టర్ ప్లాన్ ఏంటీ?

మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే సినిమాను డైరెక్ట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ.. అసలు దీన్ని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడు అన్నది తేల్చలేదు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 12:57 PM GMT
మోక్షజ్ఞ..అసలు డైరెక్టర్ ప్లాన్ ఏంటీ?
X

టాలీవుడ్‌లో సినీ వారసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే ఇలా ఎంతో మంది సినీ ప్రముఖుల ఫ్యామిలీల నుంచి చాలా మంది ఈ రంగంలోకి అడుగు పెట్టారు. అందులో కొందరు స్టార్లుగానూ మారిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ.

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మాదిరిగానే నందమూరి బాలకృష్ణ సైతం తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల అది ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే నందమూరి మోక్షజ్ఞ మొదటి చిత్రానికి సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడింది.

నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి, డైరెక్టర్ గురించి చాలా కాలంగా వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ.. అతడిని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ చిత్రాన్ని చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ - నందమూరి మోక్షజ్ఞ కలయికలో రాబోతున్న చిత్రం సూపర్ హీరో కమ్ లవ్ స్టోరీతో తెరకెక్కబోతుందని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్క్‌ను సైతం ప్రశాంత్ వర్మ కంప్లీట్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కాస్టింగ్‌తో పాటు మరికొన్ని ముఖ్యమైన విషయాలపై అతడు ఫోకస్ చేసినట్లు సమాచారం వైరల్ అవుతోంది.

మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే సినిమాను డైరెక్ట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ.. అసలు దీన్ని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడు అన్నది తేల్చలేదు. దీంతో అసలు ఈ మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా కోసం లొకేషన్ల వేటను మొదలుపెట్టినట్లు తెలిసింది. తాజాగా అతడు తన సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఈ వార్తకు బలం చేకూరింది. ఇక, ఇవన్నీ ఓకే అయిన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను దీపావళి రోజున రివీల్ చేస్తారని తెలుస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం మోక్షజ్ఞ సరసన సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తే రషా తడానీ నటిస్తున్నట్లు ఇటీవలే న్యూస్ లీకైంది. అలాగే, ఈ సినిమాకు ‘సింబా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ నందమూరి అభిమానులకు ఎలాంటి న్యూస్ చెప్తాడో చూడాలి మరి.