ఇక పై ప్రశాంత్ నీల్ డబుల్ యాక్షన్ ఉండదా?
అయితే ఈ సినిమా సక్సెస్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ మాత్రం సంతృప్తిగా లేనట్లు ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Dec 2024 2:30 PM GMT`సలార్ సీజ్ ఫైర్` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా సక్సెస్ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ మాత్రం సంతృప్తిగా లేనట్లు ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. తాను ఒకటి అనుకుంటే సినిమా ఫలితం మరోలా ఉందని నిరుత్సాహం వ్యక్తం చేసారు. ప్రభాస్ ని తానెంతో అభిమానించి డైరెక్ట్ చేసినా తాను అంచనా వేసిన ఫలితం రాలేదున్నారు.
సినిమాలో `కేజీఎఫ్` ఛాయలున్నాయనే విమర్శలు కాస్త ఇబ్బంది పెట్టినట్తు తెలిపాడు. అందుకు ఓ కారణం కూడా చెప్పుకొచ్చాడు. `సలార్` సమయంలో `కేజీఎఫ్` పై కూడా ఫోకస్ చేయడంతోనే ఇలాంటి మిస్టేక్ జరిగిందన్నాడు. దీంతో ప్రశాంత్ నీల్ సంచనల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ఒకేసారి రెండు చిత్రాలు చేయకుండా ఒక సినిమా పూర్తయ్యే వరకూ మరో ప్రాజెక్ట్ చేపట్టకూడదని నిర్ణయించుకున్నడట.
ఒకే సారి ఇద్దరి హీరోలపై ఫోకస్ పెట్టడంతో రెండు సినిమాలకు సమన్యాయం చేయడంలో విఫలమవుతున్నట్లు గ్రహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `డ్రాగన్` అనే చిత్రం పట్టాలెక్కించడానికి రెడీ అవు తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి నుంచి సినిమా మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఏకాగ్రత అంతా ఈ ప్రాజెక్ట్ పైనే ఉంది. ఎన్టీఆర్ అంటే ప్రశాంత్ కి మంచి స్నేహితుడు.
వ్యక్తిగతంగానూ అభిమానించే హీరో అతడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ తో `సలార్ -2` కూడా పూర్తి చేయాలి. ఆ సినిమా కూడా వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని ప్రచారంలో ఉంది. అయితే ప్రశాంత్ నీల్ తాజా నిర్ణయంతో ఆ ప్రాజెక్ట్ మరో ఏడాదిన్నర పాటు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.