ప్రశాంత్ నీల్ లైనప్.. డౌట్స్ అక్కర్లే!
మొత్తానికి ఇద్దరు బడా హీరోలతో కమిట్మెంట్లు ఉన్నా.. వాళ్ల వాళ్ల పనుల వల్ల ప్రశాంత్ నీల్‌పై మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 26 Oct 2024 3:00 AM GMTఇండియా వ్యాప్తంగా ఎన్నో భాషలు ఉన్నా.. అందులో కొన్ని ఇండస్ట్రీల్లో మాత్రమే పాన్ ఇండియా రేంజ్లో పేరున్న దర్శకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఇప్పటికే కొందరు డైరెక్టర్లు తమదైన మార్కును చూపించారు. అలాంటి వారిలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రశాంత్ నీల్ ఒకడు. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన అతడు.. వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు.
'కేజీఎఫ్'తో వరల్డ్ ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'సలార్: సీజ్ఫైర్' సినిమాను చేశాడు. ఇది మంచి రెస్పాన్స్‌ను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ మీద భారీ ప్రభావాన్నే చూపించింది. దీని తర్వాత అతడు ఈ చిత్రం సీక్వెల్‌ను చేస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌తోనూ ఓ భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేసేశాడు.
ప్రశాంత్ నీల్ తన తదుపరి ప్రాజెక్టును జూనియర్ ఎన్టీఆర్తోనే చేస్తాడని, ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వర్క్‌నే చేస్తున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని హొంబళే ఫిల్మ్స్ సంస్థ 'సలార్ 2' సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రశాంత్ లైనప్‌పై అనుమానాలు పెరిగిపోయాయి.
వాస్తవానికి ప్రశాంత్ నీల్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమానే చేయాలని అనుకున్నా.. హొంబళే సంస్థ 'సలార్ 2'నే కంప్లీట్ చేయాలని పట్టుబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రభాస్ ఇప్పుడు వరుసగా 'ది రాజా సాబ్'తో పాటు 'ఫౌజీ' మూవీలను చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి 'సలార్ 2' మూవీకి ఇప్పట్లో డేట్లు కేటాయించలేడు. కాబట్టి ఈ విషయంలో ప్రశాంత్ నీల్ సేఫ్ అయిపోయాడని అనుకోవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు 'వార్ 2' సినిమా షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడు. వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి వరకూ అతడు కూడా ఖాళీగా ఉండడు. కాబట్టి అప్పటి వరకూ ప్రశాంత్ తన పనులతో తాను బిజీగా ఉండొచ్చు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ఓటు తారక్‌కు మాత్రమే వేయాలని చూస్తున్నట్లు చెప్పుకోవచ్చు. ఈ టైంలో అతడు ఈ సినిమాకు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్టును రెడీ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.
మొత్తానికి ఇద్దరు బడా హీరోలతో కమిట్మెంట్లు ఉన్నా.. వాళ్ల వాళ్ల పనుల వల్ల ప్రశాంత్ నీల్‌పై మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పొచ్చు. ఇది ఒకరకంగా అతడి రాబోయే ప్రాజెక్టుకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.