Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం నీల్ భారీ సెటప్..!

హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తారక్ ఆ సినిమాలో తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 8:30 PM GMT
ఎన్టీఆర్ కోసం నీల్ భారీ సెటప్..!
X

దేవర తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తారక్ ఆ సినిమాలో తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఉందని తెలిసిందే. లాస్ట్ ఇయర్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ భారీ సెటప్ ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ సినిమాలో మలయాళ స్టార్ టోవినో థామస్ నటిస్తాడన్న టాక్ వినిపిస్తుంది. హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు టోవినో థామస్. ఐతే అతను తారక్ సినిమాలో భాగం అయితే సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుంది.

ఇక లేటెస్ట్ గా మరో మలయాళ యాక్టర్ కూడా ఈ సినిమాలో ఉంటారని టాక్. మలయళంలో బిజూ మీనన్ కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆయన కూడా ఎంచుకున్న పాత్రని పర్ఫెక్ట్ గా చేస్తూ అద్రగొట్టేస్తారు. ఎన్టీఆర్ నీల్ సినిమాలో బిజూ మీనన్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తారని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రశాంత్ నీల్ సలార్ 1 తో కూడా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ఎన్టీఆర్ సినిమా కోసం మరో సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో నీల్ సినిమా ఎలా ఉంటుందా అని ఆడియన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నరు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. అంతేకాదు సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్. సో ఎన్టీఆర్ నీల్ ఈ ఇద్దరు కలిసి చాలా పెద్ద ప్లానే వేస్తున్నట్టు తెలుస్తుంది. కథ బలంగా ఉంటేనే పాత్రదారులను కూడా స్టార్స్ ని తీసుకుంటారు. వెయిట్ ఉన్న కథ అదిరిపోయే పాత్రలు కాబట్టే టోవినో థామస్ కానీ, బిజూ మీనన్ కానీ నీల్ ఎన్ టీ ఆర్ సినిమాలో చేస్తున్నారని చెప్పొచ్చు. తప్పకుండా ఈ కలయికలో వస్తున్న సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.