Begin typing your search above and press return to search.

నీల్ మామ ఏం ప్లాన్ చేస్తున్నాడో కానీ..!

అందుకే తారక్ లేటెస్ట్ లుక్స్ ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేశాయి. స్లిమ్ లుక్ లో తారక్ అదరగొట్టాడు.

By:  Tupaki Desk   |   4 April 2025 5:21 PM
NTR slim look
X

స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబో సినిమా అంటే ఆ ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఇక పాన్ ఇండియా సూపర్ హిట్ డైరెక్టర్ తో సినిమా అంటే ఆ అంచనాలు డబుల్ అవుతాయి. ఈ క్రమంలోనే వస్తున్న సినిమా నీల్, ఎన్టీఆర్ మూవీ. కె.జి.ఎఫ్ రెండు సినిమాలు, సలార్ 1 తో సత్తా చాటిన నీల్ నెక్స్ట్ సినిమాను మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఆడియన్స్ ఫ్యాన్స్ ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నా ఈ మూవీ దానికి మించిన స్టాండర్డ్స్ లో ఉంటుందని అన్నారు. ఐతే నీల్ ఈ సినిమా బాగా వచ్చేందుకు హీరోతో పాటు అందరినీ కష్టపెడుతున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ని కూడా పూర్తిగా మార్చేస్తున్నాడట.

ఎన్టీఆర్ ఈమధ్య పర్ఫెక్ట్ లుక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. RRR, దేవర సినిమాలో అతని లుక్ బాగుంది. ఐతే నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ ని మరింత తగ్గమని చెప్పినట్టు ఉన్నాడు నీల్. అందుకే తారక్ లేటెస్ట్ లుక్స్ ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేశాయి. స్లిమ్ లుక్ లో తారక్ అదరగొట్టాడు. ఐతే ఈ లుక్ ఫ్యాన్స్ కి థ్రిల్ కలిగిస్తున్నా ప్రశాంత్ నీల్ తారక్ ని ఇంత సన్నగా ఎందుకు చూపించాలని అనుకుంటున్నాడు అని డిస్కషన్స్ మొదలయ్యాయి.

మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ కోసం గెస్ట్ గా వచ్చిన యంగ్ టైగర్ తన లుక్స్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. ఐతే ఎన్టీఆర్ నీల్ సినిమా కోసమే ఇలా స్లిమ్ గా మారాడని తెలుస్తుంది. వార్ 2 ఎలాగు పూర్తి చేశాడు కాబట్టి ఇక నీల్ సినిమా కోసమే తన పూర్తి టైం కేటాయించేలా ప్లాన్ చేసుకున్నాడు తారక్. సో ఈ స్లిం లుక్ తో నీల్ మాస్ విధ్వంసానికి రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు.