జై హనుమాన్ ఆశలు వదులుకోవాల్సిందేనా..?
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
By: Tupaki Desk | 3 March 2025 5:00 AM ISTహనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అ! తో డైరెక్టర్ గా తొలి ప్రయత్నంతోనే శభాష్ అనిపించిన ఈ డైరెక్టర్ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ముఖ్యంగా తను చేస్తున్న ప్రాజెక్ట్ ల విషయంలో నేషనల్ లెవెల్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే డైరెక్టర్ రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.
ఐతే హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. సినిమాలో హనుమాన్ గా కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని ఒప్పించాడు. ఐతే కాంతారా ప్రీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి జై హనుమాన్ కు ఇంకా డేట్స్ ఇవ్వలేదు. ఐతే జై హనుమాన్ సినిమాను 2025 అంటే ఈ ఇయర్ రిలీజ్ చేయాలని అనుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు సినిమా షూటింగ్ లేట్ అవ్వడం తప్పదని గ్రహించాడు.
అంతేకాదు ఈలోగా తను రాసిన ఒకటి రెండు కథలను వేరే దర్శకులకు ఇస్తూ అలా కూడా మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఐతే జై హనుమాన్ విషయంలో ప్రశాంత్ కాలిక్యులేషన్స్ అన్నీ తప్పుతున్నట్టుగా తెలుస్తుంది. అసలైతే ఈ టైం కి షూటింగ్ సగానికి పైగా పూర్తి చేయాలని అనుకోగా అది జరగలేదు. అంతేకాదు ఏం చేయాలన్నా కూడా రిషబ్ డేట్స్ మీద ఆధారపడి ఉంది.
అందుకే ప్రశాంత్ వర్మ సినిమా విషయంలో కాస్త టైం తీసుకునేలా ఉన్నాడని తెలుస్తుంది. సో చూస్తుంటే జై హనుమాన్ 2025 కాదు 2026 దాకా ఇంకా లేట్ అయితే మరో ఏడాది అంటే 2027 దాకా తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తుంది. హనుమాన్ సినిమా అంటే తేజా సజ్జా తో పాటు మిగతా సీజీ వర్క్ తో పూర్తి చేశాడు ప్రశాంత్ వర్మ. కానీ రిషబ్ శెట్టితో చేస్తున్న జై హనుమాన్ మాత్రం అంత తేలికగా పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు.
అందుకే ఈ సినిమా అనుకున్న టైం కన్నా లేట్ గా వచ్చేలా ఉందని తెలుస్తుంది. ఐతే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుందన్నట్టుగా ప్రశాంత్ వర్మ మాత్రం జై హనుమాన్ విషయంలో కూడా లెక్క ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నాడని తెలుస్తుంది. ఐతే ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నా పరిస్థితులు అనుకూలించాలి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.