హాలీవుడ్ రేంజ్ లో ప్రశాంత్ వర్మ సినిమా ఆఫీస్!
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజ్ నేడు పాన్ ఇండియాని టచ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడితో `అ` తో మొదలై హనుమాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు
By: Tupaki Desk | 8 Jan 2025 7:14 AM GMTయంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రేజ్ నేడు పాన్ ఇండియాని టచ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడితో `అ` తో మొదలై హనుమాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. ఈ సినిమాతో ప్రత్యేకమైన పీసీయూ యూనివర్శ్ నే క్రియేట్ చేసాడు. ఇదే యూనివర్శ్ నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ కానున్నాయి. అతడు ఇన్నో వేటివ్ డైరెక్టర్ అని తొలి సినిమాతోనే ప్రూవ్ చేసాడు. అయితే అతడి ఐడియాలజీ, విజన్ కి తగ్గట్టు ఇంతవకూ ప్రశాంత్ వర్మ సొంత ఆఫీస్ అంటూ నిర్మించుకోలేదు.
ఫేమస్ అయిన డైరెక్టర్లు అందరికీ ప్రత్యేకమైన కార్యాలయాలు ఉంటాయి. స్టోరీ డిస్కషన్, సినిమా కి సంబంధించిన పనులన్నీ అక్కడ నుంచే మొదలవుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ ఏకంగా హాలీవుడ్ రేంజ్ విజన్ తోనే తన కార్యలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా కాచిగూడ ప్రాంతాన్నే అడ్డగా చేసుకున్నట్లు సమాచారం. కాచిగూడలోని అగ్రశ్రేణి ఆర్కిటెక్ట్‌ల పర్యవేక్షణలో పెద్ద భవనాన్ని తన ఆఫీస్ గా మలుస్తున్నట్లు తెలిసింది.
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు, సినిమాకి సంబంధించి ఏ టూ జెడ్ ప్రతీది అక్కడ నుంచి ఆపరేట్ అయ్యేలా అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందిస్తున్నాడుట. స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి సెట్స్ కి వెళ్లే వరకూ ప్రాజెక్ట్ కి సంబం ధించిన పనులన్నీ అదే ఆఫీస్ లో పూర్తయ్యేలా ఆఫీస్ రూపొందుతుందిట. మరో పని కోసం జూబ్లీహిల్స్, బంజారా హల్స్, చెన్నై, ముంబై అంటూ తిరగకుండా తన ఐడియాలజీ, విజన్ కి తగ్గట్టు అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండేలా దగ్గరుండి సిద్దం చేయిస్తున్నాడుట.
రైటర్స్ టీమ్, విఎఫ్ ఎక్స్ టీమ్, పీవీసీయూ ఉద్యోగులు ఇలా అందర్నీ ఒకే తాటిపై కి తీసుకొచ్చి అక్కడ నుంచి పని చేయించేలా వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆఫీస్ సిద్దం చేయిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ రేంజ్ లో ఆఫీస్ ఇంత వరకూ టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కి లేదు. టాలీవుడ్ లో ఖరీదైన సినిమా ఆఫీస్ ఏది అంటే? వెంటనే పూరి జగన్నాధ్ కేవ్ గుర్తొస్తుంది. ఆయన ఆ కేవ్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. హౌస్ కం ఆఫీస్ గా దాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడా కేవ్ ని మించే ప్రశాంత్ వర్మ సినిమా ఆఫీస్ ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది.