Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌తో సినిమా... నీల్‌ భయ్యా కొత్త ముచ్చట

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్ తన 'సలార్‌' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   7 Dec 2023 5:13 AM GMT
ఎన్టీఆర్‌తో సినిమా... నీల్‌ భయ్యా కొత్త ముచ్చట
X

నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎన్టీఆర్‌ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. వీరి కాంబోలో సినిమా అంటూ అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. అయితే ఇద్దరికి ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా వీరి కాంబో మూవీ ఆలస్యం అవుతూ వస్తోంది.

ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాతో వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవర షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే అంటే వచ్చే మార్చి లో వార్ 2 సినిమా షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. వార్‌ 2 కి సమాంతరంగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో సినిమా ను ఎన్టీఆర్‌ చేసేందుకు డేట్లు సర్ధుబాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్ తన 'సలార్‌' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో అంతా ఊహించినట్లుగానే ఎన్టీఆర్‌ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో సినిమా ఎలా ఉండబోతుందనే విషయం గురించి ప్రశాంత్ నీల్ స్పందించాడు.

ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ... నేను గతంలో చేసిన సినిమాల నేపథ్యంలో ఎన్టీఆర్‌ తో చేయబోతున్న సినిమా కూడా యాక్షన్‌ సినిమాగానే ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అయితే నేను ఆ జోనర్‌ లో సినిమాను చేయాలని అనుకోవడం లేదు. కచ్చితంగా డిఫరెంట్‌ ఎమోషన్స్ ని కలిగి ఉండే ఒక విభిన్నమైన కథాంశంతో సినిమా ను చేయబోతున్నాను.

ఈసారి నేను కొత్త కథ ను ప్రేక్షకులకు ఎమోషన్స్ తో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లోకి విభిన్నంగా ఉంటుందని ప్రశాంత్‌ నీల్‌ చాలా నమ్మకంగా చెబుతున్నాడు. సలార్‌ సినిమా విడుదల హడావుడి పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్‌ సినిమా వర్క్‌ ప్రారంభం అవుతుందని అన్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2024 ద్వితీయార్థం లో సినిమా షూటింగ్‌ ప్రారంభించి 2025 చివరి వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే విధంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.