Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్..అసలు ఏంటీ కన్ఫ్యూజన్?

ఇప్పుడు ఆయన చేతిలో రెండు బిగ్ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 July 2024 4:41 AM GMT
ప్రశాంత్ నీల్..అసలు ఏంటీ కన్ఫ్యూజన్?
X

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో అందరి దృష్టి ఆయన అప్ కమింగ్ చిత్రాలపై పడింది. నీల్ సినిమా అంటే చాలు.. మినిమమ్ హిట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు సినీ ప్రియులు. చివరగా ప్రభాస్ సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రశాంత్ నీల్.

ఇప్పుడు ఆయన చేతిలో రెండు బిగ్ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సలార్ మూవీకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. శౌర్యాంగ పర్వం టైటిల్ తో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. దాంతోపాటు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నారు ప్రశాంత్ నీల్. చాలా నెలల క్రితం మూవీ అనౌన్స్మెంట్ రాగా.. రీసెంట్ గా తారక్ బర్త్ డే సందర్భంగా అప్డేట్ ఇచ్చారు.

ఇక ఈ రెండు సినిమాల షూటింగ్స్ త్వరలో మొదలు కానున్నాయి. అయితే రెండు చిత్రాలకు ఒకేసారి ప్రశాంత్ నీల్ వర్క్ చేయనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ టాలీవుడ్ వర్గాల్లో మరోలా టాక్ వినిపిస్తోంది. NTR 31 మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే ప్రశాంత్ నీల్ తెలిపారు. అందుకే స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. సలార్-2 కన్నా ముందు ప్రశాంత్ నీల్ NTR 31 సినిమా స్టార్ చేస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో సలార్-2 కోసం సోషల్ మీడియాలో కూడా చర్చ సాగుతోంది. NTR 31 కన్నా ముందు సలార్-2 షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఆగస్టు 10వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ మొదలవుతుందని చెబుతున్నారు. దాదాపు 15 రోజుల పాటు ప్రభాస్.. ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారని టాక్ వినిపిస్తోంది. కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. 2025లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉందని వినికిడి.

ప్రస్తుతం సలార్-2, NTR 31 సినిమాల షూటింగ్స్ మొదలవ్వడం గురించి ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు. ఏది నిజమో తెలియడం లేదని అంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్.. దేవరతోపాటు బాలీవుడ్ డెబ్యూ వార్-2 షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్.. వారిద్దరిలో నెక్స్ట్ ఎవరితో సినిమా స్టార్ట్ చేయనున్నారో చూడాలి.