KGF - సలార్.. ఎమోషనల్ టచ్ లో ఏది బెస్ట్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న సినిమా సలార్
By: Tupaki Desk | 14 Dec 2023 4:02 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న సినిమా సలార్. డిసెంబర్ 22న పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఐదు భాగాలుగా రిలీజ్ కాబోతోంది. రెండు భాగాలుగా సలార్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్ 1 ప్రస్తుతం రాబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ట్రైలర్ బాగున్న ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తో కంపారిజన్ కారణంగా చాలా మందికి కనెక్ట్ కాలేదు. తాజాగా మూవీ నుంచి ఫ్రెండ్ షిప్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ సాగే సూరీడే అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మెలోడియస్ గా బాగానే ఉంది. అయితే కేజీఎఫ్ సిరీస్ లో అమ్మ సాంగ్ తో ఈ సూరీడే సాంగ్ ని ఆడియన్స్ కంపారిజన్ చేస్తున్నారు. ఇందులో స్నేహితుడు కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయిన రెడీగా ఉండేవాడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ ఫ్రెండ్ షిప్ లో ఉన్న ఎమోషన్స్ ని ఆవిష్కరించే విధంగా సూరీడే సాంగ్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని సీక్వెన్స్ కేజీఎఫ్ చాప్టర్ 2లో సీన్స్ కి సింక్ అయ్యాయి. ముఖ్యంగా పృథ్వీరాజ్ తుళ్ళిపడి నిద్రనుంచి మేల్కొంటాడు. పక్కనే ఉన్న ప్రభాస్ నేనున్నా కదా పడుకో అంటాడు… అలాంటి సీన్ కేజీఎఫ్ చాప్టర్ 2లో ఉంటుంది.
అందులో రాకీభాయ్ సడెన్ గా నిద్రలోంచి మేల్కొంటే ఎదురుగా తల్లి కనిపించి ధైర్యం చెబుతుంది. ఆ సీన్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యింది. కొడుకుకి తల్లి మీద ఉన్న ప్రేమ అతనికి ధైర్యంగా మారిందనే ఎమోషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉంది. అయితే దాంతో పోల్చుకుంటే సూరీడే సాంగ్ లో సీన్ పెద్ద ఎఫక్టివ్ గా లేదనే మాట వినిపిస్తోంది. కేజీఎఫ్ లో అమ్మ సాంగ్ తో పోల్చుకున్న కూడా సూరీడే సాంగ్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
అయితే మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ అందుకుంటే మాత్రం మెల్లగా ఆడియన్స్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఫ్రెండ్ షిప్ బేస్డ్ మీద వచ్చిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరి వాటి సరసన ఈ సూరీడే సాంగ్ కూడా చేరుతుందా లేదా అనేది మూవీ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది.