ప్రశాంత్ నీల్ డార్క్ సినిమాలు తీయడానికి కారణం?
తన సినిమాల్లో డార్క్ కలర్ ప్యాలెట్‌ల వైపు మొగ్గు చూపడానికి కారణం ఏమిటో తాజా ఇంటర్వ్యూలో చర్చించాడు
By: Tupaki Desk | 26 Dec 2023 3:51 AM GMTKGF ఫ్రాంచైజీతో పాన్ ఇండియాలో సంచలనం సృష్టించాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 తర్వాత సలార్: పార్ట్ 1 -సీజ్ ఫైర్ ని తెరపైకి తెచ్చి రిలీజ్ చేసాడు. ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తోంది. అయితే నీల్ సినిమాలు ఎక్కువగా డార్క్ బ్యాక్ గ్రౌండ్ తో కనిపిస్తాయి ఎందుకు? అంటే దానికి సమాధానం అతడే చెప్పాడు.
తన సినిమాల్లో డార్క్ కలర్ ప్యాలెట్‌ల వైపు మొగ్గు చూపడానికి కారణం ఏమిటో తాజా ఇంటర్వ్యూలో చర్చించాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. దృశ్యపరంగా భయంకరమైన చీకటి థీమ్ కావాలనుకోవడానికి కారణం.. తన ప్రవృత్తిలో అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) ప్రధాన కారణమని చెప్పాడు. అతడు నిజాయితీగా దీనిని ఒప్పుకున్నాడు. KGF - సలార్ అలా కనిపించడానికి కారణం నాకు OCD ఉంది. ఎక్కువ రంగులు ఉన్న బట్టలు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది తెరపై నా వ్యక్తిత్వానికి ప్రతిబింబం మాత్రమేనని భావిస్తున్నాను.. అని అన్నారు.
సినిమాటోగ్రఫీ అంశాన్ని వివరిస్తూ భువన్ గౌడ అనే సినిమాటోగ్రాఫర్ తరచుగా గ్రే కలర్ ప్యాలెట్‌తో సన్నివేశాలను తీస్తాడు. అతడు ఎల్లప్పుడూ కాన్సెప్ట్‌తో కంటికి కనిపించడు! అని ప్రశాంత్ పేర్కొన్నాడు. ఈ సృజనాత్మక ఎంపిక ప్రభావం తెరపై ప్రతిబింబిస్తుంది. బహుశా ఇది చాలా మంచి విషయం లేదా చాలా చెడ్డ విషయం అని నేను గ్రహించాను అని అన్నారు.
సలార్ -KGF మధ్య పోలికల గురించి ప్రస్తావిస్తూ ..పోలిక ఉన్నా కానీ, ఇది సరైన ఎంపిక అని కూడా అన్నాడు. సలార్ కథనం గంభీరమైన నాటకీయ అంశాలతో కూడుకున్నది. అందుకే తెరపై మసకబారిన వాతావరణాన్ని కోరిందని అన్నాడు. కేజీఎఫ్‌లో నేను చేసిన దాన్ని కొంచెం రిపీట్ చేయడం ప్రారంభించినా కానీ అది సలార్ డ్రామాతో సరిగా కుదిరినందున నేను దానికి అంకితమై ఉండిపోయాను. ఇతరుల అభిప్రాయాల కారణంగా నేను దానిని మార్చాలనుకోలేదు. (ది డార్క్ విజువల్ టోన్). కథ నా మానసిక స్థితికి అనుగుణంగా ఉంటుంది అని అన్నారు.
సలార్: పార్ట్ 1లో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రేయారెడ్డి, ఈశ్వరీ రావు, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 22న విడుదలైంది. కేవలం 5రోజుల్లో దాదాపు 400 కోట్లు వసూలు చేసింది.