Begin typing your search above and press return to search.

నీల్.. ఆ హీరోతో ప్రయోగమే..

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ పేర్లు చెబితే అందులో ప్రశాంత్ నీల్ పేరు టాప్ లో ఉంటుంది

By:  Tupaki Desk   |   3 May 2024 4:27 AM GMT
నీల్.. ఆ హీరోతో ప్రయోగమే..
X

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ పేర్లు చెబితే అందులో ప్రశాంత్ నీల్ పేరు టాప్ లో ఉంటుంది. ఉగ్రం మూవీతో దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ నీల్ రెండో సినిమా కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథకి తనదైన శైలిలో హీరోయిజం, ఎలివేషన్స్ జోడించి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది.

సినీ మేధావులు కేజీఎఫ్ సిరీస్ పై విమర్శలు చేసిన సామాన్య ప్రేక్షకులు మాత్రం ఆదరించారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రభాస్ తో చేసిన సలార్ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సలార్ 2పై ప్రశాంత్ నీల్ ఫోకస్ చేశారు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఉగ్రం, కేజీఎఫ్, సలార్ చిత్రాలు మూడు ఒకే రకమైన శైలిలో మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కాయి.

ఎన్టీఆర్ కోసం తన కంఫర్ట్ జోనర్ నుంచి ప్రశాంత్ నీల్ పూర్తిగా బయటకొచ్చి సరికొత్త కథని చెప్పబోతున్నాడంట. కంప్లీట్ న్యూ జోనర్ ని ఈ మూవీ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఓ విధంగా ప్రశాంత్ నీల్ కి ఇది ఎక్స్ పర్మెంట్ అని చెప్పాలి. ఇప్పటికే తారక్ కి ప్రశాంత్ నీల్ కథ చెప్పేశారు. అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ ని ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ లో ప్రశాంత్ నీల్ ఆవిష్కరించబోతున్నాడని గతంలో ఆయన చెప్పిన మాటల బట్టి అర్ధమవుతోంది.

ప్రస్తుతం తారక్ దేవరతో పాటు వార్ 2 సినిమాని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఏడాది ఆఖరులో ప్రశాంత్ నీల్, తారక్ మూవీ అఫీషియల్ గా స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ లోపు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో సలార్ 2 మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తి చేసేస్తాడని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ ని సిల్వర్ స్క్రీన్ పై ఏ విధంగా చూపిస్తాడో తెలుసుకోవాలని తారక్ అభిమానులకి ఆసక్తి ఉంది.

కచ్చితంగా ఈ ఇద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. వార్ 2 మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో తారక్ ఇమేజ్ పెరిగిపోతుంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ మూవీ రానున్న నేపథ్యంలో అంచనాలు కూడా ఆకాశంలో ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.