Begin typing your search above and press return to search.

రాజమౌళి వల్లే ఆ కథను వదిలేశాడట

హనుమాన్ తో తెలుగులో సూపర్ హీరో మూవీ చేస్తోన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు

By:  Tupaki Desk   |   11 Jan 2024 11:57 AM GMT
రాజమౌళి వల్లే ఆ కథను వదిలేశాడట
X

హనుమాన్ తో తెలుగులో సూపర్ హీరో మూవీ చేస్తోన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. జనవరి 12న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 11 భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ మూవీతో సూపర్ హీరో సిరీస్ లకి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనేది స్టార్ట్ చేసి శ్రీకారం చుట్టారు.

ఏకంగా పది సూపర్ హీరో కథలని ప్రశాంత్ వర్మ చెప్పాలని అనుకుంటున్నాడు. ఇక మహాభారతం సిరీస్ చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రశాంత్ వర్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అలాగే మహాభారతం మూవీ సిరీస్ చేస్తే ఎవరిని ఏ పాత్రల కోసం ఎంపిక చేసుకుంటా అనేది కూడా ప్రశాంత్ వర్మ రీసెంట్ గా చెప్పారు.

అయతే మహాభారతం సిరీస్ చేయాలనే ఆలోచనని ప్రశాంత్ వర్మ విరమించుకున్నారంట. తాజాగా హనుమాన్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. రాజమౌళి మహాభారతం చేస్తానని ప్రకటించడంతో తాను ఆ ఆలోచనని వదులుకున్నట్లు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడితే మహాభారతం మూవీ అద్భుతంగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే అతని సూపర్ హీరో మూవీస్ కి మార్కెట్ దొరుకుతుంది. దానిని ప్రూవ్ చేసుకునే పనిలో అతను ఉన్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నార్త్ ఇండియా మార్కెట్ పైన ఎక్కువగా హనుమాన్ టీం ఫోకస్ చేసింది.

తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోనే ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. హనుమాన్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. హనుమాన్ తర్వాత డివివి దానయ్య తనయుడుతో అధీరా అనే మరో సూపర్ హీరో మూవీని ప్రశాంత్ వర్మ సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నాడు. దాని తర్వాత ఫిమేల్ సూపర్ హీరోతో ఒక మూవీ చేయనున్నాడు.