అనుకున్న సమయానికే హనుమాన్.. ఓ ప్లాన్ రెడీ
విజువల్స్‌తో వండర్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ
By: Tupaki Desk | 19 Aug 2023 10:15 AM GMTవిజువల్స్‌తో వండర్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. కొత్త కాన్సెప్ట్‌ల సినిమాలతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలోనే 'హను-మాన్'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో రిలీజ్ కానున్నట్లు ఆ మధ్యలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. సోషల్‌మీడియాలో యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుందీ టీజర్. అప్పట్లో ఈ టీజర్ విజువల్ ఎఫెక్ట్ వల్ల భారీ బడ్జెట్ ఆదిపురుష్ కూడా ట్రోల్స్‌కు గురౌవ్వాల్సి వచ్చింది.
ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రంతో ఏదో అద్భుతమే చేస్తాడని భావిస్తున్నారు. దీనిపై మంచి అంచనాలే పెటుకున్నారు. అయితే టీజర్ రిలీజయ్యాక.. ఈ సినిమా ఎలాంటి చప్పుడు చేయలేదు. ఎటువంటి అప్డేట్స్ కూడా రాలేదు.
దీంతి ఈ సినిమా అనుకున్న సమయానికే వస్తుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే అదే సమయంలో మహేశ్ గుంటూరు కారం, కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు ముందుగా అనుకున్న తేదీ ప్రకారం పక్కాగా విడుదల చేయాలని మూవీటీమ్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. విడుదల తేదీకి ఇంకా నాలుగు నెలలు సమయం ఉండటం వల్ల ఇక ప్రమోషన్స్ కూడా మొదలుపట్టాలని మూవీటీమ్ ఫిక్స్ అయిందట
అక్టోబర్‌లో ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభిస్తారని తెలిసింది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటం వల్ల.. ఇక అప్పటి నుంచి నాన్ స్టాప్ పబ్లిసిటీ చేస్తారట. బాలీవుడ్లో పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారట. పబ్లిసిటీకి కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా రెడీ అయిపోయిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.
ఇకపోతే ఈ సినిమా కోసం అంజనాద్రి అనే ప్రపంచాన్ని సృష్టించినట్లు గతంలో తెలిపారు దర్శకుడు ప్రశాంత్. ఈ సినిమా కోసం ఎన్నో వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి పనిచేశారట. సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించారు. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు.