Begin typing your search above and press return to search.

బాలయ్య మెచ్చిన హనుమాన్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ హనుమాన్

By:  Tupaki Desk   |   17 Jan 2024 9:40 AM GMT
బాలయ్య మెచ్చిన హనుమాన్
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ మూవీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి దూసుకుపోతోంది. ఇప్పటికి థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి.

నార్త్ ఇండియాలో అయితే హనుమాన్ ప్రభంజనం నడుస్తోంది. చాలా రోజుల తర్వాత మరల ఒక తెలుగు చిత్రానికి అక్కడ ఆదరణ లభిస్తోంది. సలార్ ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. కన్నడ యాక్టర్, డైరెక్టర్ కాంతారా ఫేం రిషబ్ శెట్టి హనుమాన్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తమిళ్ యాక్టర్స్ సైతం రియాక్ట్ అవుతున్నారు.

అలాగే శివరాజ్ కుమార్ కి బెంగుళూరులో ప్రత్యేకంగా స్క్రీనింగ్ వేసి చూపించారు. అతను కూడా మూవీపై ప్రశంసలు కురిపించడంతో పాటు తేజా సజ్జాని మెచ్చుకున్నారు. టాలీవుడ్ స్టార్స్ నుంచి కూడా ఇప్పుడిప్పుడే స్పందన వస్తోంది. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణకి ప్రశాంత్ వర్మ ప్రత్యేకంగా హనుమాన్ షో వేశారు. ఈ సినిమా చూసిన తర్వాత బాలయ్య ప్రశాంత్ వర్మ మేకింగ్ విజన్ ని మెచ్చుకున్నారు.

ఆయనని ప్రత్యేకంగా అభినందించారు. అన్ స్తాపబుల్ షోకి ప్రశాంత్ వర్మతో బాలయ్య కలిసి పని చేశారు. ఇదిలా ఉంటే హనుమాన్ తరహాలో అద్భుతమైన మైథలాజికల్ కాన్సెప్ట్ తో బాలయ్యతో ఒక సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే స్టొరీ కూడా నేరేట్ చేసి ఒకే చేయించుకున్నారంట. మొత్తానికి హనుమాన్ ప్రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి విషెస్ దొరికింది.

ఇప్పుడు బాలయ్య కూడా సినిమా చూసి ప్రత్యేకంగా చిత్ర బృందాన్ని అభినందించారు. మొత్తానికి ప్రశాంత్ వర్మ టీమ్ హనుమాన్ సినిమాతో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ని సృష్టించేలా కనిపిస్తున్నారు. హనుమాన్ స్ఫూర్తితో మరిన్ని సూపర్ హీరో కథలతో కొత్త దర్శకులు సినిమాలు చేసే అవకాశం కనిపిస్తోంది.