Begin typing your search above and press return to search.

ప్రశాంత వర్మ లిస్టులో ఆ మాస్ హీరో కూడా..

హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా ఇండియా మొత్తం పాపులర్ అయిపోయాడు

By:  Tupaki Desk   |   25 Jan 2024 8:14 AM GMT
ప్రశాంత వర్మ లిస్టులో ఆ మాస్ హీరో కూడా..
X

హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా ఇండియా మొత్తం పాపులర్ అయిపోయాడు. అందరు అతని గురించి చర్చించుకునేలా చేశాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి దూరంగా డిఫరెంట్ కథలతో డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ అదే పంథాలో వెళ్తున్నాడు. మొదటి రెండు సినిమాలతో ఆశించిన సక్సెస్ రాకపోయిన జాంబిరెడ్డి ప్రశాంత్ వర్మ టాలెంట్ ని అందరికి పరిచయం చేసింది.

ఇప్పుడు హనుమాన్ మూవీ ద్వారా ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 230 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇంకా డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపొయింది.

స్టార్ హీరోతో జై హనుమాన్ సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. త్వరలో ఈ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడంట. మేగ్జిమమ్ టైటిల్ రోల్ లో రానా నటించే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. హనుమాన్ సూపర్ సక్సెస్ కావడంతో అతనితో ఇంటర్వ్యూలు తీసుకునే ఛానల్స్ కూడా ఎక్కువయ్యాయి. స్టేట్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు అందరికి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ఇక బాలయ్య కోసం అదిరిపోయే కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. అది కూడా సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందా లేదంటే సపరేట్ గా చేస్తానా అనేది ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. అయితే బాలయ్య కూడా ప్రశాంత్ వర్మతో మూవీ చేయడానికి ఆసక్తికరంగా ఉన్నాడు. రెగ్యులర్ కమర్షియల్ కథల నుంచి బయటకొచ్చి కొత్తగా చేయాలనే కుతూహలంతో బాలయ్య ఉన్నారు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య మూవీ తెరకెక్కుతోంది. దీని తర్వాత బోయపాటితో అఖండ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అది పూర్తయిన తర్వాతనే ప్రశాంత్ వర్మకి బాలయ్య డేట్స్ దొరికే ఛాన్స్ ఉంది. బాలయ్యని సూపర్ హీరో రేంజ్ లో ప్రశాంత్ వర్మ చూపిస్తే ఆ మూవీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి నందమూరి అభిమానుల్లో కూడా ఉంది. ఒక వేళ అలా చేస్తే బాలయ్యకి ఎలాంటి మైథాలజీ క్యారెక్టర్ ని ఎడాప్ట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.