Begin typing your search above and press return to search.

అధీరా పై 'హనుమాన్‌' ఎఫెక్ట్‌.. మధ్యలో విజయ్‌

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య వారసుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   30 May 2024 4:47 AM GMT
అధీరా పై హనుమాన్‌ ఎఫెక్ట్‌.. మధ్యలో విజయ్‌
X

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య వారసుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అధీరా అనే టైటిల్ తో పాన్ ఇండియా రేంజ్ మూవీని ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ప్రకటించారు. ఆ మధ్య పోస్టర్ మరియు టీజర్ ను కూడా విడుదల చేసి హడావుడి చేయడం జరిగింది.

అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే హనుమాన్‌ సినిమా తర్వాత వెంటనే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ 'అధీరా' ను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ హనుమాన్‌ సినిమా ఎవరూ ఊహించనంత భారీగా విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ప్రస్తుతం హనుమాన్‌ కు సీక్వెల్‌ గా జై హనుమాన్ ను రూపొందించే పనిలో ప్రశాంత్‌ వర్మ పడ్డాడు.

సరే జై హనుమాన్ తర్వాత అయినా అధీరా ని మొదలు పెట్టేనా అంటే అది కూడా సాధ్యం అయ్యేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్వీర్ సింగ్‌ తో ప్రశాంత్‌ వర్మ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. కనుక అధీరా సినిమా ను ప్రశాంత్‌ వర్మ పూర్తిగా వదిలేసినట్లే అనే చర్చ జరుగుతుంది.

తాను బిజీగా ఉండటం వల్ల దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అధీరా బాధ్యతను కొరియోగ్రాఫర్ విజయ్‌ బిన్నీ కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

నా సామి రంగ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న దర్శకుడు విజయ్ బిన్నీ ఖచ్చితంగా అధీరా కు న్యాయం చేస్తాడు అనే నమ్మకంతో ప్రశాంత్‌ వర్మ ఉన్నాడట. నిర్మాత దానయ్య ను ఒప్పించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడట.

కథ మరియు స్క్రీన్‌ ప్లే పూర్తి బాధ్యత ప్రశాంత్‌ వర్మ చూసుకుంటూ దర్శకత్వ బాధ్యతలు మాత్రం విజయ్ బిన్నీ కి ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయమై దానయ్య కాంపౌండ్‌ నుంచి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కళ్యాణ్‌ ను వెంటనే హీరోగా పరిచయం చేయాలనే పట్టుదలతో ఉన్న నిర్మాత దానయ్య అధీరా ముందుకు సాగాలంటే దర్శకుడి మార్పుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియా సర్కిల్స్‌ లో కూడా చర్చ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్‌ గురించి అతి త్వరలోనే ఏదో ఒక క్లారిటీ రానుంది.