ప్రశాంత్ వర్మ.. ఫ్యూచర్ కోసం 30 కోట్లతో ఇలా..
అయితే భవిష్యత్తులో కచ్చితంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తానని సదరు హీరో అన్నారు.
By: Tupaki Desk | 27 July 2024 9:10 AM GMTహనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దీంతో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ సైతం ప్రశాంత్ వర్మతో వర్క్ చేయడానికి ఆసక్తి చూపించారు. వీరిద్దరి కలయికలో సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ కథ విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ వలన మరల ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే భవిష్యత్తులో కచ్చితంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తానని సదరు హీరో అన్నారు.
ఇక హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో జై హనుమాన్ సినిమాని ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం ఇప్పుడు వేట నడుస్తోంది. అయితే భవిష్యత్తు కోసం ఈ యువ దర్శకుడు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.
టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సొంత ప్రొడక్షన్ ఆఫీసును 30 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఆఫీసులో నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రంతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన కథా చర్చలు, పనులు జరగనున్నాయి. ఈ ప్రొడక్షన్ ఆఫీసులో వంద మంది వరకు వివిధ శాఖల టెక్నీషియన్స్ పనిచేయనున్నారు.
20 కోట్ల రూపాయలతో భవనాన్ని కొనుగోలు చేసిన ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ పూర్తి చేస్తుండగా, త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘హనుమాన్’ చిత్రానికి సిక్వెల్ గా ‘జై హనుమాన్’ ప్రాజెక్టులో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ, ఇండస్ట్రీలో కొత్తగా తెరపైనకి రానున్న నందమూరి మోక్షజ్ఞ మొదటి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
ఇక జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్ కోసం మెగాస్టార్ చిరంజీవి లేదంటే రామ్ చరణ్ అనుకుంటున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. వారిద్దరిలో ఎవరో ఒకరు చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. అయితే ఇప్పటివరకు ఈ మూవీలో టైటిల్ రోల్ ఎవరు చేస్తారనేది ప్రశాంత్ వర్మ నుంచి అఫీషియల్ గా క్లారిటీ రాలేదు. ఆయన కూడా చాలామంది స్టార్ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారు.
ఇక బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యతల్ని ప్రశాంత్ వర్మకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఓ బడా నిర్మాణ సంస్థ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉందంట. ప్రశాంత్ వర్మ కూడా మోక్షజ్ఞని తన సినిమాటిక్ యూనివర్స్ లో ఒక సూపర్ హీరో కథ ద్వారా పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మోక్షజ్ఞతో సినిమాని గ్రాండ్ గానే తెరకెక్కించాలని అనుకుంటున్నారు.