Begin typing your search above and press return to search.

ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ ప్లాన్ గట్టిగానే..

రీసెంట్ గా రణవీర్ సింగ్ కి అతను కథ చెప్పి ఒకే చేయించుకున్నాడంట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది.

By:  Tupaki Desk   |   28 April 2024 5:12 AM GMT
ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ ప్లాన్ గట్టిగానే..
X

హనుమాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాల పరంగా స్ట్రాంగ్ లైన్ అప్ పెట్టుకున్నాడు. 20 ఏళ్ళ వరకు దర్శకుడిగా కెరియర్ కొనసాగించడానికి కావాల్సిన ప్లాట్ ఫామ్ ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా వేసుకున్నాడు. ఈ PCU నుంచి 10 సూపర్ హీరో మూవీస్ వస్తాయని ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు.

అవన్నీ కూడా ఇండియన్ మైథాలజీ కథల్లో ఉన్న పాత్రల స్ఫూర్తితో సిద్ధం చేసుకున్నవని చెప్పాడు. హనుమాన్ సినిమాతో అన్ని ఇండస్ట్రీల హీరోల నుంచి ప్రశాంత్ వర్మకి ప్రశంసలు లభిస్తున్నాయి. దాంతో పాటు PCUలో తాము కూడా భాగం అవుతామని అడుగుతున్నారంట. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ రీసెంట్ గా కన్ఫర్మ్ చేశారు.

అయితే హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని ముందుగా ఈ ఏడాది తెరకెక్కించాలని ప్రశాంత్ వర్మ అనుకున్నాడు. స్క్రిప్ట్ కూడా సిద్ధంగానే ఉంది. సడెన్ గా జై హనుమాన్ ప్రాజెక్ట్ ని ప్రశాంత్ వర్మ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఓ మూవీ చేయనున్నాడు అంటూ గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది.

రీసెంట్ గా రణవీర్ సింగ్ కి అతను కథ చెప్పి ఒకే చేయించుకున్నాడంట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. అఫీషియల్ గా ప్రకటించకపోయిన ఈ కాంబినేషన్ మూవీ కన్ఫర్మ్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తన PCUలో భాగంగా సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే చేయబోతున్నాడంట.

జై హనుమాన్ కంటే ముందుగానే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లి వచ్చే ఏడాదికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడంట. త్వరలో మూవీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. బిటౌన్ లో కూడా ఇదే న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రణవీర్ సింగ్ చాలా కాలం నుంచి సూపర్ హీరో మూవీ చేయాలని అనుకుంటున్నాడు.

హనుమాన్ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ వర్మతో అతను జతకట్టడానికి ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే రణవీర్ సింగ్ తో చేయబోయే ఈ సూపర్ హీరో మూవీ కోసం ప్రశాంత్ వర్మ ఇండియన్ మైథాలజీలో ఏ పాత్రని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాడు అనేది తెలియాల్సి ఉంది.