Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోతో ప్ర‌శాంత్ నీల్ బ్యాక్ టూ బ్యాక్!

కోలీవుడ్ స్టార్ త‌ల అజిత్ తో ఏకంగా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లు ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది.

By:  Tupaki Desk   |   24 July 2024 7:30 AM GMT
ఆ స్టార్ హీరోతో ప్ర‌శాంత్ నీల్ బ్యాక్ టూ బ్యాక్!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌శాంత్ నీల్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండియాలో ఇప్పుడ‌త‌డు ఓ సంచ‌ల‌నం. అత‌డితో సినిమాలు చేయాల‌ని స్టార్ హీరోలే క్యూలో ఉన్నారు. 'కేజీఎఫ్‌', 'స‌లార్' విజ‌యాలు నీల్ ని ఆస్థానంలో కూర్చ‌బెట్టాయి. ఇప్ప‌టికే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. అలాగే స‌లార్ -2ని తెర‌కెక్కించాల్సి వుంది. ఇవి ఎప్పుడు ప‌ట్టాలెక్కుతాయి? అన్న‌ది క్లారిటీ లేదు.

సెప్టెంబ‌ర్ నుంచి తార‌క్ సినిమా మొద‌ల‌వుతుంద‌నే ప్ర‌చారంలో ఉంది. కానీ అందులో వాస్త‌వం ఏంటి? అన్న‌ది తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌శాంత్ నీల్ గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ ప్ర‌చారం జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ త‌ల అజిత్ తో ఏకంగా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్ లు ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. అజిత్ మాస్ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని రెండు సినిమాలు తెర‌కెక్కించే ప్ర‌ణాళిక‌తో నీల్ మూవ్ అవుతున్న‌ట్లు వినిపిస్తోంది.

ఒకటి భారీ యాక్షన్ డ్రామాగా ఉంటుంద‌ని, మరొకటి కేజీఎఫ్ కొనసాగింపు క‌థ 'కేజీఎఫ్-3' అని వినిపిస్తుంది. ఇందులో మొదటి చిత్రం 2025లో ప్రారంభమవుతుందిని, దాన్ని 2026లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్న‌ట్లు ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇదే నిజ‌మైతే అజిత్ అభిమానులకు పండ‌గే. ఇప్ప‌టికే ఆ కాంబినేష‌న్ లో సినిమా చూడాల‌ని ఆశ‌ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా నీల్ కి త‌మ అభ్య‌ర్ధన‌లు చేసారు. దీంతో ఈ ప్ర‌చారం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రి ఇది జ‌రుగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతానికి ప్ర‌శాంత్ నీల్ పూర్తి చేయాల్సిన సినిమాలు రెండు ఉన్నాయి. అవే 'స‌లార్ -2 'ఒక‌టి కాగా, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో రెండ‌వ‌ది. తార‌క్ సెప్టెంబ‌ర్ నుంచి డేట్లు ఇచ్చిన‌ట్లు ప్ర‌చార సాగుతోంది. అలాగే ప్ర‌భాస్ కూడా రాజాసాబ్ తో పాటు స‌లార్ -2ని ప‌ట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్న‌ట్లు వినిపిస్తుంది.

ఒక‌వేళ ప్ర‌శాంత్ నీల్ ముందుకొస్తే ఈ రెండు సినిమాలు పూర్తి చేయ‌డానికే మూడేళ్లు ప‌డుతుంది. అంత స‌మ‌యం తీసుకోక‌పోయినా రెండేళ్లు మినిమంగా ప‌డుతుంది. అంటే అజిత్ తో సినిమా అనుకుంటే 2026 చిరిక‌ల్లా సాధ్య‌మ‌వుతుంది. అలా కాకుండా ఈ ప్ర‌చారం నిజ‌మైతే వీళ్లిద్ద‌ర్నీ ప‌క్క‌న‌బెట్టి ప్ర‌శాంత్ నీల్ అజిత్ తో రంగంలోకి దిగాల్సి ఉంటుంది.