Begin typing your search above and press return to search.

హీరోల మాస్ మీటర్ కు నీల్ ఎలివేషన్లు

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రశాంత్ నీల్ కాస్త వైలెంట్ గా ఉండే టైటిల్స్ ని తన సినిమాల కి పెడుతూ ఉంటాడు.

By:  Tupaki Desk   |   18 May 2024 5:06 AM GMT
హీరోల మాస్ మీటర్ కు నీల్ ఎలివేషన్లు
X

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మూవీ ఏడాదికి క్రితమే ఎనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. అయితే ప్రశాంత్ నీల్ సలార్ 2 మూవీ తర్వాత ఎన్టీఆర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. సలార్ 2 రిలీజ్ కి ముందే ఆ చిత్రాన్ని స్టార్ట్ చేస్తాడా లేదంటే తర్వాత సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రశాంత్ నీల్ కాస్త వైలెంట్ గా ఉండే టైటిల్స్ ని తన సినిమాల కి పెడుతూ ఉంటాడు. ఉగ్రం, కేజీఎఫ్, సలార్ ఇలా అస్సలు ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని టైటిల్స్ తో మూవీస్ చేయడం ప్రశాంత్ నీల్ స్టైల్. ఈ నేపథ్యంలో తారక్ తో చేయబోయే సినిమాకి అదే తరహాలో టైటిల్ ఉంటుందని అందరూ భావించారు.

అయితే ఈ సారి డ్రాగన్ అనే టైటిల్ ని నేరుగా మూవీగా పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోయిజం ఎలివేట్ చేయడం కోసం ఇలాంటి టైటిల్స్ ని వాడుతూ ఉంటాడు. డైనోసార్, మాన్స్టర్ పదాలు సలార్, కేజీఎఫ్ 2లలో హీరోలని ఉద్దేశించి ఉపయోగించారు. ఈ సారి హీరో క్యారెక్టరైజేషన్ ని డ్రాగన్ తో పోలిక పెట్టి తారక్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అదే పేరు సినిమాకి పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

కానీ ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. తారక్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ప్రశాంత్, తారక్ సినిమాపై ఎదో ఒక అప్డేట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ టైటిల్ పోస్టర్ ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. తారక్ ప్రస్తుతం దేవర మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ మే 19న రిలీజ్ కాబోతోంది. దీనికోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

హిందీ డెబ్యూ మూవీగా వార్ 2 తారక్ చేస్తున్నాడు. మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తారక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.